ETV Bharat / sports

రొనాల్డో ఇన్​స్టా పోస్టుకు రూ.11 కోట్లు.. కోహ్లీకి ఎంత? - లియోనల్ మెస్సీ

ఇన్​స్టాగ్రామ్​ ద్వారా అత్యంత ఎక్కువ ఆదాయం సంపాదిస్తోన్న సెలబ్రిటీస్​లో ఫుట్​బాల్ స్టార్ రొనాల్డో అగ్రస్థానం దక్కించుకున్నాడు. అలాగే టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) టాప్-20లో చోటు సంపాదించాడు.

ronaldo, kohli
రొనాల్డో, కోహ్లీ
author img

By

Published : Jul 1, 2021, 10:35 AM IST

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ ఫాలోయింగ్​ ఉన్న క్రీడాకారుల్లో పోర్చుగల్ ఫుట్​బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) ముందుంటాడు. ఇతడితో పాటు టీమ్ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli), ఫుట్​బాల్ స్టార్ లియోనల్ మెస్సీ.. వారి ఆటతో అదరగొడుతూ సోషల్ మీడియాలోనూ ఫాలోవర్లను సంపాదిస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​ ఇన్​స్టాగ్రామ్​లో వీరికి కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇందులో వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు కొన్ని ప్రమోషన్లు చేస్తుంటారు. దీని ద్వారా డబ్బు సంపాదిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఇన్​స్టా పోస్టు ద్వారా ఎక్కువగా ఆర్జించిన సెలబ్రిటీల్లో రొనాల్డో అగ్రస్థానం దక్కించుకున్నాడు.

ఓ నివేదిక ప్రకారం 2021 ఏడాదిలో ఇన్​స్టాగ్రామ్​లో ఒక్కో పోస్టుకు రొనాల్డో రూ. 11.9 కోట్లు ఆర్జిస్తున్నాడు. గతేడాది WWE స్టార్, హాలీవుడ్ హీరో డ్వేన్ జాన్సన్ (The Rock) రూ.11 కోట్లతో మొదటి స్థానంలో ఉండేవాడు. తాజాగా ఇతడు రెండుకు పడిపోయాడు. వీరి తర్వాత స్థానాల్లో పాప్ సింగర్ అరియానా గ్రాండే(Ariana Grande) నిలిచింది.

టాప్-20లో కోహ్లీ

ఈ జాబితాలో టాప్-20లో నిలిచిన ఏకైక క్రికెటర్​గా ఘనత వహించాడు టీమ్ఇెండియా సారథి విరాట్ కోహ్లీ. ఇతడు ఒక్కో స్పాన్సర్డ్ పోస్టుకు రూ.5కోట్లు సంపాదిస్తూ 19వ స్థానంలో నిలిచాడు. అలాగే ప్రపంచంలో ఎక్కువగా ఆర్జిస్తోన్న క్రీడాకారుల జాబితాలో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇతడి కంటే ముందు ఫుట్​బాల్ స్టార్స్​ రొనాల్డో, మెస్సీ(Lionel Messi), నెయ్​మర్ ఉన్నారు. ఇక బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా రూ.3 కోట్లతో 27వ స్థానం దక్కించుకుంది.

మొత్తం 395 మంది సెలబ్రిటీలతో ఈ జాబితాను రూపొందించగా.. కోహ్లీ తప్ప మరే టీమ్ఇండియా క్రికెటర్​ ఇందులో చోటు దక్కించుకోలేదు. దక్షిణాఫ్రికాకు చెందిన డివిలియర్స్, డుప్లెసిస్, డెయిన్ స్టెయిన్​ కూడా ఈ జాబితాలో ఉన్నారు .

ఇవీ చూడండి: 'నిన్ను జట్టు నుంచి తప్పించిందెవరు?'- వార్నర్ ఫన్నీ రిప్లై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.