ETV Bharat / sports

ఫౌల్ అని చెప్పినందుకు రిఫరీనే చితకబాదాడు! - ఫుట్​బాలర్ న్యూస్

మ్యాచ్​ జరుగుతుండగా ఫౌల్​ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ఫుట్​బాలర్(brazilian footballer)​ రిఫరీని(Referee Football) చితక్కొట్టాడు. ఈ ఘటన బ్రెజిల్​లో జరిగింది. అనంతరం ఆ ఆటగాడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు అధికారులు.

football
ఫుట్​బాల్
author img

By

Published : Oct 7, 2021, 9:29 AM IST

'అర్జున్​ రెడ్డి' సినిమాలో హీరో విజయ్ దేవరకొండ.. ఓ ఫుట్​బాల్​ మ్యాచ్​ జరుగుతుండగా ఆగ్రహానికి గురై రిఫరీని(Referee Football) కొట్టబోతాడు. అయితే.. అంతకుమించిన ఘటన తాజాగా ఓ ఫుట్​బాల్​ మ్యాచ్​లో జరిగింది. ఏకంగా మ్యాచ్​ మధ్యలోనే ఓ ఫుట్​బాలర్(Brazilian Footballer) రిఫరీని చితకబాదాడు. అసలేమైందంటే!

ఇదీ జరిగింది..

సావో పౌలో స్పోర్ట్స్​ క్లబ్, గౌరాని జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. సావో పౌలో జట్టుకు చెందిన ఫుట్​బాల్ ఆటగాడు విలియమ్ రైబెరోకు మ్యాచ్​ రిఫరీ ఫౌల్​ చూపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన విలియమ్ రిఫరీని కింద పడేసి తలపై తన్నాడు. గ్రౌండ్​లోనే చితకబాదాడు.

వెంటనే పోలీసులు, ఇతర సిబ్బంది మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చి రిఫరీని అంబులెన్స్​లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. జట్టులోని ఇతర ఆటగాళ్లు విలియమ్​ను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మ్యాచ్​ను 14 నిమిషాల పాటు నిలిపివేశారు.

  • Brazilian footballer William Ribeiro has been charged with attempted murder after kicking referee Rodrigo Crivellaro in the head knocking him unconscious during a second division match. pic.twitter.com/vhJfGycexN

    — 🖤💛⚽ (@ElijahKyama) October 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మ్యాచ్​ అనంతరం.. ఫుట్​బాల్​ ఆటగాడిపై హత్యాయత్నం(అటెంప్టివ్ మర్దర్) కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని స్టోర్ట్స్​క్లబ్ తెలిపింది. రైబెరోపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

ఇదీ చదవండి:శాప్‌ ఛాంపియన్‌షిప్‌: డ్రాతో మొదలెట్టిన భారత్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.