అర్జెంటీనా సూపర్‌స్టార్, ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ.. మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. బార్సిలోనా ఎఫ్సీకి గుడ్‌బై చెప్పాలకున్న ఆయన.. ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నాడు. తాజాగా అదే జట్టుతో కలిసి ట్రైనింగ్ సెషల్లో పాల్గొన్నాడు. ఆ సమయంలో తీసిన ఫొటోను అభిమానులతో పంచుకుంది క్లబ్ యాజమాన్యం.
-
First workout of the day | Leo #Messi, @Phil_Coutinho, @5sergiob, @DeJongFrenkie21, and @ANSUFATI train with the group! pic.twitter.com/XbzEQTsOd7
— FC Barcelona (@FCBarcelona) September 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">First workout of the day | Leo #Messi, @Phil_Coutinho, @5sergiob, @DeJongFrenkie21, and @ANSUFATI train with the group! pic.twitter.com/XbzEQTsOd7
— FC Barcelona (@FCBarcelona) September 9, 2020First workout of the day | Leo #Messi, @Phil_Coutinho, @5sergiob, @DeJongFrenkie21, and @ANSUFATI train with the group! pic.twitter.com/XbzEQTsOd7
— FC Barcelona (@FCBarcelona) September 9, 2020
యూటర్న్..
విభేదాల కారణంగా మెస్సీ ఈ సీజన్ నుంచే బార్సిలోనాకు దూరం కావాలనుకున్నాడు. కానీ కాంట్రాక్టు ప్రకారం అతడు 2021 చివరి వరకు తమతో ఉండాల్సిందేనని, లేదంటే 837 మిలియన్ డాలర్లు చెల్సించాల్సి వుంటుందని సదరు క్లబ్ స్పష్టం చేసింది. కోర్టుల వెంట తిరిగే కంటే.. ఈ ఏడాదికి క్లబ్ తరఫునే ఆడాలని నిర్ణయించుకున్నాడు మెస్సీ. ఈ సీజన్ ముగిసే వరకు మాత్రమే జట్టుతో ఉండనున్నాడు.