ETV Bharat / sports

భయంతో పాకిస్థాన్​కు అఫ్గాన్​ ఫుట్​బాల్​ క్రీడాకారిణులు - Woman football players escape Afghanistan

తాలిబన్ల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్​ ఫుట్​బాల్​ క్రీడాకారిణులు ఎట్టకేలకు ఆ దేశ సరిహద్దు దాటారు. 32 మంది ఫుట్​బాల్​ ప్లేయర్లు తమ కుటుంబసమేతంగా ఎమర్జెన్సీ వీసాతో పాకిస్థాన్​ చేరుకున్నట్లు కొన్ని మీడియా కథనాలు వచ్చాయి. అఫ్గాన్​ సరిహద్దు దాటేందుకు వారికి బ్రిటీష్​ ఆధారిత ఎన్​జీఓ 'ఫుట్​బాల్​ ఫర్​ పీస్​'​, 'పాకిస్థాన్​ ఫుట్​బాల్​ ఫెడరేషన్' సంస్థలు సహకరించాయి.

Afghan female footballers evade Taliban, reach Pakistan
పాకిస్థాన్ చేరుకున్న అఫ్గాన్​ ఫుట్​బాల్​ క్రీడాకారిణులు
author img

By

Published : Sep 15, 2021, 3:40 PM IST

తాలిబన్ల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్​ పుట్​బాల్​ క్రీడాకారిణులు క్షేమంగా పాకిస్థాన్​ చేరుకున్నారు. 32మంది అథ్లెట్లు తమ కుటుంబసభ్యులతో మానవతా ధృక్పథంతో పాక్​ జారీ చేసిన అత్యవసర వీసాలతో పాక్​కు చేరినట్లు కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి.

అఫ్గాన్​ నేషనల్​ జూనియర్​ బాలికల టీమ్​కు చెందిన ఈ క్రీడాకారిణులు తొలుల ఖతర్​ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఆగస్టు 26న కాబుల్​లో జరిగిన బాంబు దాడి వల్ల అక్కడే చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వారు అక్కడే భయంభయంగా బతికారు. తమను కాపాడాలంటూ వీడియో సందేశాల ద్వారా ప్రార్థించారు. బ్రిటీష్​ ఆధారిత ఎన్​జీఓ సంస్థ 'ఫుట్​బాల్​ ఫర్​ పీస్​'​, 'పాకిస్థాన్​ ఫుట్​బాల్​ ఫెడరేషన్' చొరవతో ఈ ప్లేయర్స్ అఫ్గాన్​ సరిహద్దు​ దాటగాలిగారు. ​

ఫుట్​బాల్​లో తాము ఆడిన కారణంగా తాలిబన్ల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని ఆ క్రీడాకారిణులు వాపోయారు. ఆగస్టులో తాలిబన్లు అఫ్గానిస్థాన్​ దేశాన్ని ఆక్రమించారు. అప్పటినుంచి ఈ అథ్లెట్లు వారికి కనిపించకుండా తలదాచుకున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి.. IPL 2021: ఈ ప్లేయర్స్​ ఇలా కనిపించి.. అలా వెళ్లిపోయారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.