ఇంగ్లండ్ మాంచెస్టర్ నగరంలోని జాతీయ ఫుట్‌బాల్ మ్యూజియంలో ఓ దొంగతనం జరిగింది. అరుదైన ఫుట్‌బాలర్ టీషర్ట్‌ను దొంగిలించాడో వ్యక్తి. ప్రస్తుతం అతడిని వెతికే పనిలో ఉన్నారు పోలీసులు. అతడు 30 ఏళ్ల వ్యక్తి అని, ఎటువంటి రుసుము చెల్లించకుండా మ్యూజియంలోకి ప్రవేశించాడని చెప్పారు. అనుమానితుడి ఫొటోను విడుదల చేశారు.
10వ నంబరు జెర్సీ గల ఆ టీషర్టు.. 1991/92 మధ్య కాలంలో బోయస్ లెజెండ్ చార్లీ నికోలస్ ధరించారు. ప్రస్తుతం దాని ధర 600 పౌండ్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.55 వేలు).