ETV Bharat / sports

విమాన ప్రమాదం- నలుగురు ఫుట్​బాలర్లు మృతి - విమాన ప్రమాదం.. నలుగురు ఫుట్​బాలర్లు మృతి

బ్రెజిల్​లోని టొకాన్టిన్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రముఖ ఫుట్​బాలర్లు మృతిచెందారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.

footballer
ఫుట్​బాలర్​
author img

By

Published : Jan 25, 2021, 10:09 AM IST

Updated : Jan 25, 2021, 10:16 AM IST

బ్రెజిల్​లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టొకాన్టిన్​ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు ఫుట్​బాలర్లు సహా బ్రెజిలియన్​ సాసర్​ క్లబ్​ పల్మాస్​ అధ్యక్షుడు లుకాస్ మెయిరా, పైలట్​ ​మరణించారు. ఈ విషయాన్ని సదరు జట్టు​ యాజమాన్యం తెలిపింది. టేకాఫ్ అయ్యే సమయంలో విమానం ఒక్కసారిగా కూలిపోవడం వల్ల ప్రమాదం జరిగిందని వెల్లడించింది.

విలానోవా జట్టుతో మ్యాచు ఆడేందుకు ఈ ఆటగాళ్లంతా గొయానాకు బయలుదేరారు. అంతకముందుకు వీరికి చేసిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో పాజిటివ్​గా తేలింది. ఈ కారణంగా వీరిని మ్యాచు జరిగే ప్రదేశానికి ప్రత్యేక విమానంలో పంపింది జట్టు యాజమాన్యం. ఆ సమయంలోనే ఈ ఘటన జరిగింది. మృతులను లుకాస్ మెయిరా(జట్టు అధ్యక్షుడు), లుకాస్ ప్రాక్సేడెస్, గుయిల్హెర్మె నో, రనులే, మార్కస్ మోలినారిగా(ఆటగాళ్లు)గా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.

ఇదీ చూడండి: ఆరంభంలో అదరగొట్టి.. ఆ తర్వాత కనుమరుగైన క్రికెటర్లు

Last Updated : Jan 25, 2021, 10:16 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.