ETV Bharat / sports

జాతీయ ఫుట్​బాల్ జట్టు మాజీ​ కోచ్​ కన్నుమూత - ఫుట్​బాల్​ కోచ్​ హకీమ్

జాతీయ ఫుట్​బాల్​ జట్టు మాజీ కోచ్​ హకీమ్​ ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. ఐదు దశాబ్దాల పాటు ఫుట్​బాల్​ ఆటలో సేవలు అందించిన హకీమ్​.. 1960 రోమ్​ ఒలింపిక్స్​లో భారత్​కు ప్రాతినిధ్యం వహించారు. హకీమ్​ మృతిపట్ల ఏఐఎఫ్​ఎఫ్​ సంతాపం వ్యక్తం చేసింది.

Rome olympian hakim
భారత మాజీ ఫుట్​బాల్​ కోచ్​ కన్నుమూత
author img

By

Published : Aug 22, 2021, 5:26 PM IST

భారత​ ఫుట్​బాల్ మాజీ ఆటగాడు, కోచ్​.. సయిద్​ షాహిద్​ హకీమ్​ (82) కర్ణాటక గుల్బర్గాలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన హకీమ్​.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హకీమ్​ సాబ్​గా గుర్తింపు పొందిన ఆయన.. భారత ఫుట్​బాల్​కు ఐదు దశాబ్దాల పాటు సేవలు అందించారు.

వాయుసేనలో స్క్వాడ్రాన్​ లీడర్​గా బాధ్యతలు నిర్వర్తించిన హకీమ్.. 1960 రోమ్​ ఒలింపిక్స్​లో తొలిసారి భారత ఫుట్​బాల్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో జట్టు కోచ్​గా ఆయన తండ్రి సయిద్​ అబ్దుల్​ రహీమ్​ ఉన్నారు. అయితే హకీమ్​ జట్టులో ఉన్నా.. ఆ సమయంలో ఆడే అవకాశం రాలేదు. దేశీయ ఫుట్​బాల్​ టోర్నీల్లో కోచ్​గా ​హకీమ్​ కీలక పాత్ర పోషించారు. హకీమ్​ సేవలను గుర్తించిన ప్రభుత్వం ధ్యాన్​చంద్​ అవార్డు, ద్రోణాచార్య అవార్డులతో గౌరవించింది.

హకీమ్​ మృతి పట్ల ఏఐఎఫ్​ఎఫ్​ (ఆల్​ ఇండియా ఫుట్​బాల్​ ఫెడరేషన్​) అధ్యక్షుడు ప్రఫుల్​ పటేల్​ సంతాపం వ్యక్తం చేశారు. దేశంలో ఫుట్​బాల్​కు ఆదరణ పెరగడంలో హకీమ్​ కృషి మరువలేనిది అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : ఒలింపిక్స్​లో ఎప్పటికీ చెక్కు చెరగని రికార్డులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.