ETV Bharat / sports

అదరహో.. జింబాబ్వే చేతిలో బంగ్లాదేశ్ చిత్తు

జింబాబ్వే పర్యటనలో భాగంగా ఆడిన రెండో టీ20లో బంగ్లాదేశ్​ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. జింబాబ్వే లాంటి పసికూనపై 23 పరుగుల తేడాతో బంగ్లా జట్టు ఓడింది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్​ను జింబాబ్వే జట్టు సమం చేసింది.

Zimbabwe Hit Back to Level The T20I Series Against Bangladesh
జింబాబ్వే Vs బంగ్లాదేశ్​
author img

By

Published : Jul 23, 2021, 10:26 PM IST

బంగ్లాదేశ్​తో జరిగిన రెండో టీ20లో జింబాబ్వే జట్టు విజయం సాధించింది. కట్టుదిట్టమైన బౌలింగ్​ చేసి ప్రత్యర్థిని 143 పరుగులకే ఆలౌట్ చేసి 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్​ను సమం చేసింది. తొలుత టాస్​ గెలిచి బ్యాటింగ్​కు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. మాధ్వేరే(73) అర్ధశతకంతో అలరించగా.. డియోన్​ మైయర్స్​(26), రైయాన్​ బుర్ల్​(34) ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. మరోవైపు బంగ్లాదేశ్​ జట్టు బౌలర్లలో షోరిఫుల్​ ఇస్లామ్​ 3 వికెట్లు పడగొట్టగా.. మహేది హసన్​, షకిబుల్​ హసన్​ చెరో వికెట్​ పడగొట్టారు.

అనంతరం 167 ర​న్స్​ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్​ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు మొహమ్మద్​ నయీమ్​(5), సౌమ్య సర్కార్​(8) వెంటనే వెనుదిరిగారు. అనంతరం క్రీజులోకి వచ్చిన మిడిల్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్​ జింబాబ్వే బౌలర్ల ధాటికి ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు. షామిమ్​ హుస్సేన్​(29) టాప్​ స్కోరర్​. లుకే జాంగ్వీ, వెల్లింగ్టన్​ మసకడ్జా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. టెండాయ్​ చతార, బ్లెస్సింగ్ ముజరబాని చెరో 2 వికెట్లు సాధించింది. దీంతో బంగ్లా టీమ్​ 19.5 ఓవర్లలో 143 పరుగులు చేసి ఆలౌట్​ అయ్యింది. ఫలితంగా 23 పరుగులు తేడాతో రెండో టీ20లో జింబాబ్వే గెలుపొందింది. దీంతో మూడు టీ20ల సిరీస్​ను జింబాబ్వే జట్టు 1-1తో సిరీస్​ సమం చేసింది.

ఇదీ చూడండి.. ఒలింపిక్స్​లో రెండో రోజు.. బరిలో తెలుగు తేజాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.