ETV Bharat / sports

IPL 2023: మినీ వేలంలో ఆ జింబాబ్వే క్రికెటర్​కు ఫుల్ డిమాండ్​!.. కన్నేసిన మూడు టీమ్​లు..

author img

By

Published : Nov 16, 2022, 11:19 AM IST

క్రికెట్​ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్​ 2023 సీజన్​ సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను బీసీసీఐ చకాచకా పూర్తి చేస్తోంది. అయితే ఈసారి మినీ వేలంలో జింబాబ్వే స్పిన్ ఆల్‌రౌండర్ సికిందర్ రాజా పంట పండనుంది. ఎందుకంటే?

sikandar raza
సికిందర్ రాజా

ఐపీఎల్ 2023 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ పూర్తయ్యింది. బీసీసీఐ విధించిన గడువు కూడా ముగిసింది. దీంతో 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ప్రకటించాయి. ఇక డిసెంబర్ 23న కేరళలోని కొచ్చి వేదికగా మినీ వేలం జరగనుంది. పేరుకు మినీ వేలమే అయినా.. కావాల్సిన ఆటగాళ్ల కోసం కోట్లు ఇచ్చేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి.

అయితే ఈ మినీ వేలంలో జింబాబ్వే స్పిన్ ఆల్‌రౌండర్ సికిందర్ రాజా పంట పండనుంది. ఆస్ట్రేలియా వేదికగా ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2022లో సికిందర్ రాజా అద్భుత ప్రదర్శనను కనబరిచాడు. మొత్తం 8 ఇన్నింగ్స్‌ల్లో 27.37 సగటుతో 219 పరుగులు చేసిన సికిందర్ రాజా.. 11 సిక్స్‌లు సిక్సులు కొట్టి ఔరా అనిపించుకున్నాడు. 15.60 యావరేజ్‌తో 10 వికెట్లు పడగొట్టాడు.

టీ20 ప్రపంచకప్ ప్రదర్శనతో.. జింబాబ్వే సూపర్ -12 చేరి.. రన్నరప్ పాకిస్థాన్‌ను ఓడించింది. ఆ మ్యాచ్​లో సికిందర్​ రాజా కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన సికిందర్ రాజా.. రాబోయే ఐపీఎల్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ ఆడే అవకాశం ఈ జింబాబ్వే ప్లేయర్‌కు దక్కలేదు. కానీ తాజా ప్రపంచకప్ ప్రదర్శనతో అతనిపై ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి పడింది. ఈ క్రమంలోనే అతని కోసం పలు ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. అదే జరిగితే సికిందర్ రాజాకు భారీ ధర పలికే అవకాశం ఉంది.

సులభంగా రూ.5 కోట్లు.. డిసెంబర్ 23న జరిగే మినీ వేలంలో దాదాపు రూ.5 కోట్లకు పైగానే సికిందర్ రాజా పలికే అవకాశం ఉన్నట్లు ఆకాశ్ చోప్రా వంటి క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే సీజన్ భారత్‌లోనే జరుగుతుండటం, సికిందర్ రాజా క్వాలిటీ స్పిన్ ఆల్‌రౌండర్​తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతడికి కలిసొచ్చే అంశం. అంతేకాకుండా మిడిలార్డర్ ధాటిగా ఆడగలడు. కాబట్టి ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతని కోసం పోటీపడే అవకాశం ఉంది.

కన్నేసిన మూడు జట్లు.. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు పంజాబ్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ ఫ్రాంచైజీలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ 2022 రిటెన్షన్ ప్రక్రియలో మొత్తం 163 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకున్న పది ఫ్రాంచైజీలు.. 85 మంది ప్లేయర్లను వేలంలోకి విడుదల చేశాయి.

ఇక రిటెన్షన్ ప్రక్రియ తర్వాత అత్యధికంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దగ్గర 42.25 కోట్లు ఉండగా.. అతి తక్కువ కేకేఆర్ దగ్గర రూ.7.05 కోట్లు ఉన్నాయి. సన్‌రైజర్స్ తర్వాత పంజాబ్ కింగ్స్ దగ్గర 32.2 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ రూ.23.35 కోట్లు, ముంబయి ఇండియన్స్ రూ.20.55 కోట్లు, సీఎస్‌కే రూ. 20.45 కోట్లు, దిల్లీ క్యాపిటల్స్ రూ. 19.45 కోట్లు, గుజరాత్ టైటాన్స్ రూ.19.25 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ రూ.13.2 కోట్లు, ఆర్‌సీబీ రూ.8.75 కోట్లు ఉన్నాయి.

ఇదీ చదవండి: టెన్నిస్ అభిమానులకు శుభవార్త.. ఆస్ట్రేలియా ఓపెన్​లో ఆడనున్న జకోవిచ్

ఉమ్రాన్‌ మాలిక్‌ టాలెంట్‌పై కేన్‌ కీలక వ్యాఖ్యలు.. నాన్​స్ట్రైకర్ రనౌట్​పై ఏమన్నాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.