ETV Bharat / sports

'నాలుగో టెస్టు బౌలింగ్ విభాగంలో మార్పులు చేయాలి' - జహీర్ ఖాన్ శార్దూల్ ఠాకూర్

ఇంగ్లాండ్​తో జరగబోయే నాలుగో టెస్టులో బౌలింగ్​ విభాగంలో మార్పులు చేయాలని సూచించాడు మాజీ పేసర్ జహీర్ ఖాన్. తుది జట్టులో అశ్విన్, శార్దూల్​ ఠాకూర్​కు అవకాశం ఇవ్వాలని తెలిపాడు.

Zaheer Khan
జహీర్
author img

By

Published : Sep 1, 2021, 9:29 PM IST

గురువారం నుంచి ఓవల్‌ వేదికగా ప్రారంభం కానున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ కోసం.. భారత బౌలింగ్‌ విభాగంలో మార్పులు చేయాలని మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ సూచించాడు. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అందుబాటులో ఉన్నా.. సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను కచ్చితంగా జట్టులోకి తీసుకోవాలన్నాడు. ఎందుకంటే ఓవల్‌ పిచ్‌ స్పిన్ బౌలింగ్‌కు చక్కగా అనుకూలిస్తుందని.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో అశ్విన్‌, జడేజాలిద్దరినీ బరిలోకి దించినట్లుగానే ఇక్కడ కూడా ఇద్దరినీ తీసుకోవాలని తెలిపాడు.

"ఓవల్‌ పిచ్‌ స్పిన్‌కు సహకరిస్తుంది. ఇటీవల ఇక్కడ జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో 5 మ్యాచుల్లో స్పిన్నర్లు 59 వికెట్లు తీశారు. హెడింగ్లే టెస్టులో విఫలమైన సీనియర్‌ బౌలర్‌ ఇషాంత్ శర్మను తప్పించి అతడి స్థానంలో అశ్విన్‌ను తీసుకుంటారు అనుకున్నా. అలాగే, మూడు టెస్టుల్లో కలిపి 13 వికెట్లు తీసిన యువ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాలి. పని భారం దృష్ట్యా యాజమాన్యం అతడి స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకోవాలి. శార్దుల్‌ బంతితో పాటు బ్యాటుతోనూ సత్తా చాటగలడు. దీంతో భారత బ్యాటింగ్‌ విభాగం మరింత బలోపేతం అవుతుంది" అని జహీర్‌ ఖాన్‌ పేర్కొన్నాడు.

గురువారం మధ్యాహ్నం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రంలోపు భారత సారథి విరాట్‌ కోహ్లీ జట్టులో మార్పు చేర్పుల గురించి ప్రకటించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: వైడ్ ఇవ్వని అంపైర్.. పొలార్డ్​ వింత నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.