ETV Bharat / sports

ఉర్రూతలూగిస్తున్న యువీ 'టీజర్'​.. ఇక సెకండ్ ఇన్నింగ్స్​ షురూ! - యువరాజ్‌

Yuvraj Singh: టీమ్​ఇండియా మాజీ స్టార్ ఆల్​రౌండర్​ యువరాజ్ సెకండ్ ఇన్నింగ్స్​కు సమయం ఆసన్నమైంది. 'అభిమానులారా? అందుకు సిద్ధంగా ఉన్నారా?' అంటూ ఉర్రూతలూగించే ఓ వీడియోను పోస్టు చేశాడు యువీ.

Yuvraj Singh
యువరాజ్‌ సింగ్‌
author img

By

Published : Dec 7, 2021, 9:47 PM IST

Yuvraj Singh: ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన వీరుడు యువరాజ్‌ సింగ్‌. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్‌ దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. రెండేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్, అబుదాబి టీ10, ఐపీఎల్‌ వంటి లీగ్‌ల్లోనే ఆడుతూ వచ్చాడు. అయితే అయితే గతేడాది నుంచి ఐపీఎల్‌లోనూ ఆడటం లేదు. ఈ క్రమంలో 'వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అభిమానుల కోసం మళ్లీ క్రికెట్‌ పిచ్‌ మీదకు రావాలని ఆశిస్తున్నా' అంటూ కొన్ని రోజుల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ఒక్కసారిగా యువీ అభిమానులు సహా క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. యువరాజ్‌ సింగ్‌ క్రికెట్‌లోకి పునరాగమనం చేస్తాడా? అనే చర్చలూ నడిచాయి.

Yuvraj Singh
యువరాజ్

ఇప్పుడు మరోసారి యువీ తన సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు సర్‌ప్రైజ్‌ చేస్తూ చిన్న వీడియో టీజర్‌ను రిలీజ్‌ చేశాడు. తన సెకండ్‌ ఇన్నింగ్స్‌కు సమయం ఆసన్నమైందంటూ వీడియోలో పేర్కొన్నాడు. టీజర్‌కు క్యాప్షన్‌గా "మీరంతా సిద్ధంగా ఉన్నారా? ఈ సంవత్సరమే సరైన సమయం. మీ అందరికీ బిగ్‌ సర్‌ప్రైజ్‌. అలానే ఉండండి" అంటూ పోస్టు చేశాడు.

  • It's that time of the year. Are you ready? Do you have what it takes? Have a big surprise for all you guys! Stay tuned! pic.twitter.com/xR0Zch1HtU

    — Yuvraj Singh (@YUVSTRONG12) December 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: yuvraj singh: యువరాజ్​ నుంచి గుడ్​న్యూస్.. మైదానంలోకి రీఎంట్రీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.