టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli)కి మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) అండగా నిలిచాడు. అతడు ప్రపంచంలోని అత్యుత్తమ సారథుల్లో ఒకడని ప్రశంసించాడు. ఐసీసీ ట్రోఫీలు గెలిచేందుకు అతడికి మరికాస్త సమయం కావాలని సూచించాడు. పెద్ద టోర్నీల్లో ఫైనళ్లకు చేరుకోవడం సాధారణ విషయం కాదని వెల్లడించాడు.
"విరాట్ కోహ్లీ నంబర్ వన్ సారథి. అతడెంతో సాధించాడని రికార్డులే చెబుతున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్. మీరు ఐసీసీ ట్రోఫీల గురించి అడుగుతున్నారు. అతడింకా ఐపీఎల్ టైటిలే గెలవలేదు. అతడికి మరికాస్త సమయం ఇవ్వాల్సిన అవసరముందని నా అభిప్రాయం. ఈ రెండు మూడేళ్లలోనే వరుసగా 2-3 ప్రపంచకప్‌లు ఉన్నాయి. రెండు టీ20 ప్రపంచకప్‌లు, ఒక వన్డే ప్రపంచకప్ ఉంది. నిజానికి ఇలాంటి టోర్నీల్లో ఫైనల్‌కు వెళ్లడమే కష్టం. కొన్నిసార్లు ఎక్కడో పొరపాట్లు జరుగుతుంటాయి" అని రైనా అన్నాడు.
టీమ్‌ఇండియా(TeamIndia 'choker')ను చోకర్ అనేందుకు వీల్లేదని రైనా స్పష్టం చేశాడు. ఇప్పటికే భారత్ మూడు ప్రపంచకప్‌లు(Worldcups) గెలిచిందని గుర్తు చేశాడు. "మనం చోకర్స్ కాదు. 1983, 2011 వన్డే ప్రపంచకప్‌లు, 2007 టీ20 ప్రపంచకప్ గెలిచాం. ఆటగాళ్లు కఠోరంగా సాధన చేస్తున్నారని మనం గ్రహించాలి. మూడు ప్రపంచకప్‌లు వస్తున్నందున చోకర్స్ అనేందుకు వీల్లేదు" అని వెల్లడించాడు.
ఇదీ చూడండి: