ETV Bharat / sports

పాక్​ బ్యాటింగ్​ కోచ్​ పదవికి యూనిస్​ గుడ్​ బై​

author img

By

Published : Jun 22, 2021, 5:22 PM IST

Updated : Jun 22, 2021, 7:25 PM IST

పాకిస్థాన్​ బ్యాటింగ్ కోచ్ పదవికి యూనిస్ ఖాన్ రాజీనామా చేశాడు. కారణం తెలినప్పటికీ అతడి నిర్ణయాన్ని తాము అంగీకరిస్తున్నామని పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు వెల్లడించింది.

younis khan, pakisthan cricket board
యూనిస్ ఖాన్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు

పాకిస్థాన్​ బ్యాటింగ్ కోచ్​ పదవి నుంచి మాజీ కెప్టెన్​ యూనిస్ ఖాన్​ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతడి నిర్ణయాన్ని అయిష్టంగానే ఒప్పుకున్నట్లు వెల్లడించింది. రాజీనామా వెనక గల కారణం మాత్రం తెలియలేదు.

జూన్​ 25 నుంచి జులై 20 వరకు ఇంగ్లాండ్​లో పర్యటించనుంది పాక్ జట్టు. అక్కడు 3 వన్డేలతో పాటు 3 టీ20లు ఆడనుంది. ఆ తర్వాత అటునుంచి అటే విండీస్​ టూర్​కు వెళ్లనుంది. జులై 21 నుంచి ఆగస్టు 24 వరకు ఐదు టీ20లతో పాటు రెండు టెస్ట్​ల సిరీస్​లో పాల్గొననుంది.

బ్యాటింగ్ కోచ్​ లేకుండానే పాకిస్థాన్ జట్టు యూకే టూర్​కు వెళ్లనుంది. విండీస్​ పర్యటన నాటికి యూనిస్ స్థానంలో మరొకరిని నియమించే అవకాశం ఉంది. అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

ఇదీ చదవండి: ఇల్లు గడవడానికి క్యాబ్​ డ్రైవర్​గా మారిన క్రికెటర్

తన పాత్ర పట్ల సంతోషంగా లేని కారణంగానే ఈ పదవి నుంచి యూనిస్ వైదొలిగినట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. పాకిస్థాన్​ జాతీయ జట్టు భవిష్యత్​పై అతడు అసంతృప్తిగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పదవికి గతేడాది నవంబర్​లో ఎంపికయ్యాడు. 2022 టీ20 ప్రపంచకప్​ వరకు బ్యాటింగ్​ కోచ్​గా అతనికి సమయముంది.

యూనిస్ రాజీనామాపై పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీమ్ ఖాన్​ స్పందించారు. మంచి నిపుణుడి సేవలు కోల్పోతున్నామని తెలిపారు. తామిద్దరి వరుస చర్చల తర్వాతనే యూనిస్ ఈ నిర్ణయం తీసుకున్నాడని పేర్కొన్నారు. ఇష్టం లేనప్పటికీ స్నేహపూర్వకంగానే అతని రాజీనామాకు అంగీకారించాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్​లో అతడు బోర్డుతో తన ఆలోచనలు పంచుకుంటాడని ఆశిస్తున్నట్లు చెప్పారు.

పాక్​ బోర్డు వల్లేనా?

అయితే యూనిస్​ నిర్ణయం వెనక పాకిస్థాన్ క్రికెట్​ బోర్డు హస్తం పరోక్షంగా ఉందని తెలుస్తోంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్​కు ముందు పాక్ శిక్షణ శిబిరంలోకి మాజీ క్రికెటర్​ మహమ్మద్​ యూసుఫ్​ను అనుమతించింది పీసీబీ. ఈ నిర్ణయంతో సంతృప్తి చెందని యూనిస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ నివేదిక పేర్కొంది.

ఇది కొత్తేం కాదు..

పాకిస్థాన్ క్రికెట్​లో టెస్టుల్లో పదివేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లలో యూనిస్​ కూడా ఒకడు. కెరీర్​ ఆరంభం నుంచి సమస్యలతో సతమతమవుతుండేవాడు. పీసీబీ ఛైర్మన్​తో కలవడానికి సమయం లేదనే కారణంతో 2007 ఛాంపియన్స్​ ట్రోఫీ సమయంలో పాకిస్థాన్ కెప్టెన్సీని వదులుకున్నాడు. అటు తర్వాత కొంత కాలానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పటికీ.. 2009లో అతని కెప్టెన్సీపై జట్టులోని కొందరు ఆటగాళ్లు ఫిర్యాదులు చేశారు. కెరీర్​ చివరలో పీసీబీ ఇచ్చిన నగదు పురస్కారాన్ని కూడా అతడు తిరిగి ఇచ్చేశాడు.

ఇదీ చదవండి: WTC Final: ఆలస్యంగా ప్రారంభమైన ఐదోరోజు ఆట

Last Updated : Jun 22, 2021, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.