ETV Bharat / sports

రంజీల్లో యశ్​ ధుల్ రికార్డు.. మూడో క్రికెటర్​గా ఘనత - యశ్​ధూల్

Yash Dhull Ranji Trophy: యువక్రికెటర్​ యశ్​ధుల్​ రంజీల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అరంగేట్రం మ్యాచ్​లోనే రెండు ఇన్నింగ్స్​లో రెండు సెంచరీలు బాది రికార్డులో నిలిచాడు. తమిళనాడుతో మ్యాచ్​లో 200 బంతుల్లో 100 పరుగులు చేశాడు. మరోవైపు ఈ మధ్యకాలంలో బ్యాటింగ్​లో తడబడుతున్న పుజారా మళ్లీ పుంజుకున్నాడు. ముంబయితో మ్యాచ్​లో 83 బంతుల్లో 91 పరుగులు చేశాడు.

yashdhul
యష్​ధూల్
author img

By

Published : Feb 20, 2022, 3:57 PM IST

Updated : Feb 20, 2022, 4:11 PM IST

Yash Dhull Ranji Trophy: టీమ్​ఇండియా అండర్​-19 వరల్డ్​కప్ కెప్టెన్​గా అదరగొట్టి, జట్టును ఛాంపియన్​గా నిలబెట్టిన యశ్​ధుల్​.. రంజీల్లో కూడా దుమ్మురేపుతున్నాడు. తొలి మ్యాచ్​లోనే రెండు సెంచరీలు బాదాడు. తొలి ఇన్నింగ్స్​లో శతకం నమోదు చేసిన ధూల్​.. రెండో ఇన్నింగ్స్​లో కూడా మరో సెంచరీ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రంజీల్లో అరంగేట్రం మ్యాచ్​లోనే రెండు ఇన్నింగ్స్​లో రెండు శతకాలు బాదిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు ఈ ఘనత నారీ కాంట్రాక్టర్, విరాగ్​ అవతేల పేరిట ఉంది.

దిల్లీకి ఆడుతున్న ధుల్​.. తమిళనాడుతో మ్యాచ్​లోని రెండో ఇన్నింగ్స్​లో 200 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇందులో 13 బౌండరీలు ఉన్నాయి. అంతకుముందు తొలి ఇన్నింగ్స్​లో 113 పరుగులు చేశాడు.

మళ్లీ ఫామ్​లోకి..

టీమ్​ఇండియా టెస్టు జట్టులో స్థానం కోల్పోయి బీసీసీఐ వేటుకు గురైన రహానె-పుజారా ద్వయం మళ్లీ రంజీ మ్యాచ్​లతో ఫామ్​ అందుకుంది. సౌరాష్ట్రతో మ్యాచ్​లో సెంచరీ బాదిన రహానె ఫామ్​లోకి వచ్చాడు. మరోవైపు పుజారా.. తొలిఇన్నింగ్స్​లో డకౌట్​ అయినా రెండో ఇన్నింగ్స్​ నిలకడగా ఆడి 83 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఇందులో 16 ఫోర్లు, ఓ సిక్సర్​ ఉన్నాయి.

ఈసారి రంజీ ట్రోఫీని రెండు విడతలుగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10న ప్రారంభమైన ఈ టోర్నీ తొలి దశ మార్చి 15 వరకు కొనసాగుతుంది. ఐపీఎల్​ పూర్తయ్యాక మే 30 నుంచి జూన్​ 26 వరకు రెండో దశ టోర్నీ జరుగుతుంది.

ఇదీ చూడండి : కష్టాలను ఎదురీది.. అండర్​-19 ప్రపంచకప్​ హీరోగా తెలుగు తేజం

Last Updated : Feb 20, 2022, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.