ETV Bharat / sports

WTC Final: కెప్టెన్​గా కోహ్లీ.. ఆటగాడిగా రోహిత్ రికార్డులు - రెండు ప్రారంభ ఐసీసీ ఈవెంట్ ఫైనల్స్‌లో రోహిత్

సౌథాంప్టన్ వేదికగా కివీస్​తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్​తో(WTC Final) టీమ్ఇండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. అరుదైన రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్​తో భారత జట్టుకు అత్యధిక టెస్ట్ మ్యాచ్​ల్లో కెప్టెన్​గా వ్యవహరించిన ఆటగాడిగా కోహ్లీ ఫీట్​ సాధించాడు. రెండుసార్లు ఐసీసీ ప్రారంభ ఈవెంట్​ ఫైనల్స్​లో పాల్గొన్న మొదటి ఆటగాడిగా రోహిత్​ ఘనత వహించాడు.

virat kohli, rohit sharma
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
author img

By

Published : Jun 19, 2021, 8:28 PM IST

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సారి తన ఆటతీరుతో కాకుండా తన కెప్టెన్సీ వల్ల సరికొత్త ఫీట్​ను అందుకున్నాడు కోహ్లీ. సుదీర్ఘ ఫార్మాట్​లో టీమ్ఇండియాకు అత్యధిక మ్యాచ్​ల్లో సారథ్యం వహించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇప్పటివరకు మాజీ కెప్టెన్ ధోనీతో సమానంగా 60 టెస్ట్​ల్లో భారత్​కు నాయకత్వం వహించాడు విరాట్. తాజాగా సౌథాంప్టన్​ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ మ్యాచ్​తో(WTC Final) కోహ్లీ.. 61వ టెస్ట్​లో టీమ్ఇండియాకు సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

టెస్ట్​ల్లో అత్యధిక మ్యాచ్​లకు సారథిగా వ్యవహరించిన కెప్టెన్ల జాబితాలో విరాట్ ఆరో స్థానంలో నిలిచాడు. అతడి కంటే ముందు గ్రేమ్ స్మిత్(దక్షిణాఫ్రికా) అత్యధికంగా 109 టెస్ట్​ల్లో నాయకత్వం వహించాడు. అలెన్​ బోర్డర్​, స్టీఫెన్ ఫ్లెమింగ్, రికీ పాంటింగ్, లాల్లయిడ్​ అతడి తర్వాత ఉన్నారు.

దీంతో పాటు టెస్టుల్లో టీమ్ఇండియాకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్​గానూ తొలి స్థానంలో ఉన్నాడు విరాట్. 61 టెస్ట్​ల్లో భారత్​కు నాయకత్వం వహించి 36 మ్యాచ్​లు గెలిపించాడు. మరో 14 మ్యాచ్​లు ఓడిపోగా.. 10 మ్యాచ్​లను డ్రాగా ముగించాడు.

ఇదీ చదవండి: టీమ్ఇండియా టెస్టు ప్రయాణం చరిత్రాత్మకం!

రోహిత్ అరుదైన రికార్డు..

టీమ్ఇండియా ఓపెనర్​ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు ప్రారంభ ఐసీసీ ఈవెంట్ ఫైనల్స్‌లో పాల్గొన్న మొదటి ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ ఘనత అందుకున్న తొలి ఆటగాడు అతడే కావడం విశేషం.

ఇదీ చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ వాచ్ అంత ఖరీదా?

ఇక 2007 టీ20 ప్రారంభ ప్రపంచకప్​లోనూ రోహిత్​ కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్​తో జరిగిన తుదిపోరులో.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్​ గంభీర్​ తర్వాత అత్యధిక రన్స్​ చేసింది రోహితే. కేవలం 16 బంతుల్లోనే 30 పరుగులు చేసి జట్టుకు ఉపయుక్తమైన స్కోరు అందించాడు. లక్ష్య ఛేదనలో పాక్ 152 పరుగులకు ఆలౌటైంది. దీంతో ప్రారంభ పొట్టి కప్​ను భారత్​ గెలుపొందింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.