ETV Bharat / sports

షెడ్యూల్​ ప్రకారమే డబ్ల్యూటీసీ ఫైనల్: ఐసీసీ - ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్

ముందుగా నిర్ణయించిన తేదీల్లోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ను నిర్వహిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. దేశంలో కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. యూకే, భారత్​ను 'రెడ్​ లిస్ట్'​లో చేర్చింది. అయినప్పటికీ మ్యాచ్ ​షెడ్యూల్​ ప్రకారమే జరుగుతుందని వెల్లడించింది. ఆ తుదిపోరులో న్యూజిలాండ్​తో తలపడనుంది టీమ్​ఇండియా.

wtc final, ind vs nz
ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్, ఇండియా vs న్యూజిలాండ్
author img

By

Published : Apr 20, 2021, 10:09 AM IST

ప్రపంచ టెస్టు​ ఛాంపియన్​షిప్​(డబ్ల్యాటీసీ) ఫైనల్​ను.. షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) స్పష్టం చేసింది. కొవిడ్ రెండో దశ విజృంభిస్తుండటం వల్ల.. యూకే, భారత్​కు అన్ని అంతర్జాతీయ ప్రయాణాలు నిలిపివేసింది. ఇండియాను 'రెడ్​ లిస్ట్'​లో చేర్చింది. భారత్​ నుంచి లండన్​ వెళ్లే ప్రయాణికులకు.. 10 రోజుల హోటల్ క్వారంటైన్​ను తప్పనిసరి చేసింది.

అయినప్పటికీ డబ్ల్యూటీసీ ఫైనల్​ బయోబబుల్​ వాతవరణంలో యథావిధిగా జరుగుతుందని ఐసీసీ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: ఐరోపా ఫుట్‌బాల్‌లో చీలిక.. కొత్తగా సూపర్‌ లీగ్‌

"కరోనా నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్​ను జాగ్రత్తగా నిర్వహించాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో పాటు ఇతరులు సమాలోచనలు జరిపారు. ముందు నిర్ణయించిన ప్రకారమే ఈ మ్యాచ్​ జరుగుతుంది. రెడ్​ లిస్టులో చేర్చిన దేశాల గురించి యూకే ప్రభుత్వంతో చర్చిస్తున్నాం."

-ఐసీసీ.

భారత మహిళల జట్టు కూడా జూన్​లో యూకేలో పర్యటించనుంది. అలాగే పురుషుల జట్టు కూడా ఐదు టెస్టు మ్యాచ్​ల నిమిత్తం ఇంగ్లాండ్ టూర్​కు వెళ్లనుంది. యూకేలోని సౌథాంప్టన్​ వేదికగా కివీస్​-భారత్​ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్​ జూన్​ 18-22 మధ్య జరగనుంది.

ఇదీ చదవండి: ఫిట్​నెస్​లో అదే నా ప్లస్ పాయింట్: ధోనీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.