ETV Bharat / sports

ఐపీఎల్ ఫైనల్​ విషయంలో బీసీసీఐకి కొత్త చిక్కు.. ఏంటంటే? - ఐపీఎల్​ ఫైనల్​ తేదీ మార్పు

ఐపీఎల్ నిర్వహణ విషయంలో బీసీసీఐకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఏంటంటే?

WTC  final to be held in june 1st week
ఐపీఎల్ విషయంలో బీసీసీఐకి కొత్త చిక్కులు.. ఏంటంటే?
author img

By

Published : Dec 7, 2022, 10:56 AM IST

ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం, ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన తేదీల విషయమై చర్చ నడుస్తోంది. మార్చి 31 లేదా దాదాపుగా ఏప్రిల్ 1న మెగాలీగ్​ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే​ ఆరంభం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నప్పటికీ ముగింపు తేదీ మాత్రం బీసీసీఐకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. జూన్ 4వ తేదీన ఫైనల్ జరపాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను జూన్ తొలి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. లండన్‌లోని ది ఓవల్ స్టేడియంలో జూన్ 7-11 తేదీల మధ్య టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ రెండు బడా ఈవెంట్​లు వెంటవెంటనే ఉండటంతో ప్లేయర్స్​కు కష్టంగా మారనుంది.

ముఖ్యంగా ఐపీఎల్​ ప్లే ఆఫ్స్​ లేదా ఫైనల్​కు విదేశీ ప్లేయర్స్​ అందుబాటులో ఉండటం ఇబ్బంది కరంగా ఉంటుంది. అలానే భారత జట్టు కూడా ఒకవేళ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2023) ఫైనల్‌కు అర్హత సాధించినా అది కూడా మనోళ్లకు కాస్త కష్టమే. కాబట్టి బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్‌ను సవరించాల్సి వస్తుంది. అయితే దీనిపై ఓ బోర్డు అధికారి స్పందిస్తూ.. మే 30 కన్నా ముందే ఐపీఎల్ ఫైనల్ నిర్వహించేలా ప్రణాళిక రచిస్తామని పేర్కొన్నారు.

కాగా, టీమ్​ఇండియా డబ్ల్యూటీసీ 2023 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ఈ నెలలోనే బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడనున్న భారత్ వచ్చే ఏడాది సొంత గడ్డ మీద ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. బంగ్లాదేశ్‌‌తో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంతోపాటు.. ఆసీస్‌పై టెస్టు సిరీస్‌లో భారత్ 4-0 లేదా 3-0 తేడాతో గెలిస్తే టీమ్​ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరుకుంటుంది. ఇరు జట్ల మధ్య చివరి వన్డే మార్చి 22న జరిగే అవకాశం ఉంది.

గత ఐపీఎల్ సీజన్లో మాదిరిగానే వచ్చే సీజన్​లోనూ పది ఫ్రాంచైజీలు బరిలోకి దిగనున్నాయి. ఐపీఎల్‌ మినీ వేలంలో 991 ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిసింది. ఇందులో భారత ఆటగాళ్లు 714 మంది. విదేశీ ఆటగాళ్ల సంఖ్య పరంగా ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా 57 మంది, స్కాట్లాండ్‌ నుంచి అత్యల్పంగా ఇద్దరు వేలం బరిలో దిగనున్నారు. దక్షిణాఫ్రికా (52), వెస్టిండీస్‌ (33), ఇంగ్లాండ్‌ (31), న్యూజిలాండ్‌ (27), శ్రీలంక (23), అఫ్గానిస్థాన్‌ (14), ఐర్లాండ్‌ (8), నెదర్లాండ్స్‌ (7), బంగ్లాదేశ్‌ (6), యూఏఈ (6), జింబాబ్వే (6), నమీబియా (5) ఆటగాళ్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఈ ఆటగాళ్ల జాబితాలో 185 మంది మాత్రమే అంతర్జాతీయ క్రికెటర్లు. దేశవాళీ క్రికెటర్లలో 604 మంది భారత క్రికెటర్లు. 20 మంది సభ్య దేశాల క్రికెటర్లు. అంతర్జాతీయ అరంగేట్రం చేయకుండా ఇప్పటికే ఐపీఎల్‌లో ఆడిన భారత ఆటగాళ్లు 91 మంది, విదేశీయులు 604 మంది వేలంలో పాల్గొననున్నారు.

ఇదీ చూడండి: క్లిష్ట పరిస్థితుల్లో టీమ్​ఇండియా.. ఎటు పోతోంది మన క్రికెట్‌?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.