ETV Bharat / sports

WTC Final: టీ విరామానికి కివీస్​ 36/0 - ఇండియా vs న్యూజిలాండ్ స్కోర్లు

ఇంగ్లాండ్ వేదికగా ఇండియాతో జరుగుతోన్న మ్యాచ్​లో కివీస్​ టీ విరామానికి 36/0 పరుగులతో నిలిచింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. క్రీజులో ఓపెనర్లు లాథమ్(17*)​, కాన్వే(18*) ఉన్నారు.

wtc final, india vs nz
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇండియా vs న్యూజిలాండ్
author img

By

Published : Jun 20, 2021, 8:31 PM IST

సౌథాంప్టన్​ వేదికగా కివీస్​తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్​లో టీమ్​ఇండియా కట్టుదిట్టమైన బౌలింగ్​ చేస్తోంది. టీ విరామ సమయానికి న్యూజిలాండ్​ వికెట్లేమీ నష్టపోకుండా 21 ఓవర్లకు 36 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో ఓపెనర్లు లాథమ్(17*)​, కాన్వే(18*) ఉన్నారు.

పేస్​ హైలైట్​..

బ్యాటింగ్​కు దిగిన సమయంలో న్యూజిల్యాండ్​ ఓపెనర్లు ఆత్మవిశ్వాసంతో కనపడ్డారు. ఆరంభంలోనే బౌండరీలు కూడా కొట్టారు. కానీ ఆ తర్వాత భారత బౌలర్లు ఇషాంత్​, బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్​ వేశారు. ఆ తర్వాత బంతిని అందుకున్న షమీ.. ఓపెనర్ల పని మరింత కష్టంగా మార్చాడు. నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్​మెన్​ను ముప్పుతిప్పలు పెట్టాడు. కొద్ది ఓవర్లే వేసినప్పటికీ.. ఆశ్విన్​ కూడా ఆకట్టుకున్నాడు. వికెట్లేమీ పడనప్పటికీ.. టీ విరామం వరకు బౌలింగ్​ పరంగా టీమ్​ఇండియా మంచి ప్రదర్శనే చేసిందని చెప్పుకోవాలి.

అయోమయం..!

న్యూజిలాండ్​ బ్యాంటింగ్​ సమయంలో ఆట కొంతసేపు ఆగిపోయింది. వర్షం పడుతోందని చెప్పి అంపైర్లు ఆటను నిలిపివేశారు. కవర్లు కూడా పిచ్​ మీదకు వచ్చాయి. కానీ అవి చినుకులేనని టీమ్​ఇండియా ఆటగాళ్లు మైదానంలో ఉండిపోయారు. కొద్ది నిమిషాల్లోనే న్యూజిలాండ్​ ఓపెనర్లు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టారు.

అంతకుముందు టీమ్ఇండియా 217 పరుగులకు ఆలౌటైంది. ఓవర్​నైట్​ స్కోరుకు మరో 71 పరుగులు జోడించి మిగతా 7 వికెట్లను కోల్పోయింది. ఆట ప్రారంభించిన టీమ్ఇండియా.. కాసేపటికే కెప్టెన్​ కోహ్లీ వికెట్​ను కోల్పోయింది. అద్భుతమైన బంతితో జేమీసన్.. విరాట్​ను​ ఎల్బీగా పెవిలియన్​ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్​ పంత్​ కూడా ఆకట్టుకోలేకపోయాడు. 22 బంతులాడి కేవలం 4 పరుగులే చేసిన పంత్​ అనవసరమైన షాట్​ ఆడి జేమీసన్​ బౌలింగ్​లో ఔట్​ అయ్యాడు. మరో బ్యాట్స్​మన్​ అజింక్య రహానె.. సంయమనం ప్రదర్శించాడు. అర్ధ సెంచరీకి చేరువైన అతడిని వాగ్నర్​ బోల్తా కొట్టించాడు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన అశ్విన్​(27 బంతుల్లో 22 పరుగులు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసి చివరికి స్లిప్స్​లో దొరికిపోయాడు. చివర్లో వెంటవెంటనే వికెట్లు పడిపోయాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.