వరల్డ్ టెస్టు ఛాంఫియన్షిప్(World Test Championship) విజేతను తేల్చేందుకు ఫైనల్లో 'బెస్ట్ ఆఫ్ త్రీ' విధానం ఉంటే బాగుండేది టీమ్ఇండియా(Team india) కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతానికి ఇలా జరిగినప్పటికీ, భవిష్యత్తులో మాత్రం ఫైనల్ల్లో మూడు మ్యాచ్ల విధానం పెట్టాలని సూచించాడు. ఇంగ్లాండ్ బయలుదేరే ముందు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని పంచుకున్నాడు శాస్త్రి.
"టెస్టు ఛాంపియన్షిప్ను కొనసాగించాలని ఐసీసీ(ICC) భావిస్తే.. ఫైనల్లో ఒక్క మ్యాచ్ కాకుండా 'బెస్ట్ ఆఫ్ త్రీ' పెడితే బాగుంటుంది. ఇక్కడివరకు వచ్చేందుకు భారత కుర్రాళ్లు చాలా శ్రమించారు. రాత్రికి రాత్రే దక్కిన విజయం ఇది కాదు"
ప్రస్తుతం స్వదేశంలో క్వారంటైన్లో ఉన్న టీమ్ఇండియా.. గురవారం వేకువజామున ఇంగ్లాండ్కు పయనమవుతుంది. జూన్ 18న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిఫ్ ఫైనల్(WTC FINAL), ఆ తర్వాత ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది.
ఇవీ చదవండి: