ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది నిజంగా దుర్వార్తే! సౌథాంప్టన్ వేదికగా జరగనున్న ఫైనల్‌కు వర్షగండం పొంచి ఉంది. రిజర్వు డేతో కలిసి మొత్తం ఆరు రోజులు సాధారణం నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం. వాతావరణ శాఖ, వాతావరణ వెబ్‌సైట్లు ఈ విషయాన్నే తెలియజేస్తున్నాయి.
తొలిరోజు వాతావరణం
సౌథాంప్టన్‌లో నేడు (జూన్ 18) తేలికపాటి వర్షం వచ్చే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడే అవకాశం ఉందని అక్కడి వాతావారణ శాఖ చెబుతోంది. దాదాపుగా 80% వర్షం వస్తుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
-
@mufaddal_vohra Bhai
— Vedanshu Rawal (@Vedanshurawal22) June 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Weather ☁️ Update next 5 days in Southampton ....
I feel very Sad 😭
Washout 💔 #TeamIndia pic.twitter.com/nvc9gnoSLP
">@mufaddal_vohra Bhai
— Vedanshu Rawal (@Vedanshurawal22) June 18, 2021
Weather ☁️ Update next 5 days in Southampton ....
I feel very Sad 😭
Washout 💔 #TeamIndia pic.twitter.com/nvc9gnoSLP@mufaddal_vohra Bhai
— Vedanshu Rawal (@Vedanshurawal22) June 18, 2021
Weather ☁️ Update next 5 days in Southampton ....
I feel very Sad 😭
Washout 💔 #TeamIndia pic.twitter.com/nvc9gnoSLP
డ్రా అయితే విజేత ఎవరు?
ఇప్పటికే న్యూజిలాండ్ ఐసీసీ టోర్నీల్లో ‘టై’ గండాలు ఎదుర్కొంటోంది. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మ్యాచులో, సూపర్ ఓవర్లలో స్కోర్లు సమం కావడం వల్ల ప్రపంచకప్ ట్రోఫీ దక్కకుండా పోయింది. ఇప్పుడు టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ అలాంటి పరిణామాలే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ టెస్టుకు ఆరో రోజును రిజర్వ్ డేగా ప్రకటించారు. ఏదైన కారణం చేత ఐదు రోజుల్లో ఫలితం తేలకపోతే ఆరో రోజున అవకాశం ఇస్తారు. ఈ రోజున కూడా రిజల్ట్ రాకపోతే రెండు జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు.'