సౌథాంప్టన్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. భారత్-న్యూజిలాండ్ మధ్య జరగబోయే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 9 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో టైటిల్ విజేతగా నిలిచిన జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ రాబోతుంది. రన్నరప్‌తో పాటు మిగతా జట్లకు ఏం లభిస్తుంది? అన్న విషయాలు తెలుసుకుందాం.
- విజేతకు ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ గదతో పాటు రూ.11.71 కోట్ల (1.6 మిలియన్ డాలర్లు)ను బహుమతిగా ఇస్తారు.
- డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన జట్టు(రన్నరప్) రూ.5.85 కోట్ల (8 లక్షల డాలర్లు)ను బహుమతిగా పొందుతుంది.
- మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.3.29 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన టీమ్‌కు రూ.2.56 కోట్లు, తర్వాత స్థానాల్లో నిలిచిన జట్లకు వరుసగా రూ.1.46 కోట్లు, రూ.73 లక్షలు.. ప్రైజ్‌మనీగా దక్కనున్నాయి.
గతంలో డబ్ల్యూటీసీ విజేతలుగా నిలిచిన జట్లకు గదను బహుమతిగా ఇచ్చేవారు. ఏడాది చివరి నాటికి ఏ టీమ్ అయితే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంటుందో ఆ జట్టును విజేతగా ప్రకటించేవారు.