న్యూజిలాండ్ లాంటి కఠిన ప్రత్యర్థి ఉన్నప్పటికీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు(డబ్ల్యూటీసీ) చేరడంపై టీమ్ఇండియా పూర్తి విశ్వాసంతో ఉందని క్రికెటర్ హనుమ విహారి చెప్పాడు. ఇంగ్లాండ్లో జూన్ 18 నుంచి 22 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. అందులో మెరుగైన ప్రదర్శన చేసేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నట్లు వెల్లడించాడు.
"డబ్ల్యూటీసీ ఫైనల్, ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగే టెస్టు సిరీస్ కోసం బాగా సిద్ధమవుతున్నాను. ఇది డబ్ల్యూటీసీ మొదటి ఎడిషన్ కాబట్టి భారత అభిమానులందరూ ఆసక్తిగా, ఉత్కంఠంగా ఎదురుచూస్తుంటారు. మేం ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడబోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అది సవాలే. అయితే, భారత జట్టు అద్భుతాలు చేయగలదు"
- హనుమ విహారి, టీమ్ఇండియా బ్యాట్స్ మన్
గాయం కారణంగా స్వదేశంలో ఇంగ్లాండ్తో సిరీస్కు దూరమైన విహారి.. మళ్లీ టెస్టు జట్టులో చేరనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మూడో టెస్టులో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడుతూ, అతడు గాయపడ్డాడు. 161 బంతుల్లో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచి, మ్యాచ్ డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇదీ చూడండి: ఇంగ్లాండ్ బయల్దేరిన కివీస్ ఆటగాళ్లు