ETV Bharat / sports

WTC Final: భారత్-కివీస్​ ఫేస్ టూ ఫేస్ రికార్డులు - డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రివ్యూ

అన్నిజట్లనూ ఓడిస్తూ వచ్చిన టీమ్​ఇండియా, న్యూజిలాండ్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ల్లో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ఈ మ్యాచ్​ జరగనుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య ఇంతకు ముందు ఎన్ని టెస్టులు జరిగాయి? ఎక్కువ పరుగుల ఎవరు చేశారు? అత్యధికంగా వికెట్లు ఎవరు తీశారు? లాంటి విషయాలే ఈ స్టోరీ.

WTC Final
డబ్ల్యూటీసీ ఫైనల్
author img

By

Published : Jun 17, 2021, 1:30 PM IST

దాదాపు రెండేళ్లుగా జరుగుతోన్న టెస్టు ఛాంపియన్​షిప్ తుది అంకానికి చేరుకుంది. శుక్రవారం నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్​ జరగనుంది. రెండు జట్లూ మొదటి నుంచి ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చెలాయిస్తూ ఇక్కడివరకూ వచ్చాయి. ఈ పోరు​లోనూ గెలిచి టైటిల్ కొట్టేయాలని చూస్తున్నాయి. అందుకోసం పక్కా ప్లాన్స్ వేస్తున్నాయి. ఈ సందర్భంగా ఇరుజట్ల ముఖాముఖి రికార్డులపై ఓ లుక్కేద్దాం.

హెడ్​ టూ హెడ్

ఇంగ్లీష్ గడ్డపై రెండు అగ్రశ్రేణి జట్లు టెస్టు ఛాంపియన్​షిప్ టైటిల్​ కోసం పోటీపడుతుండటం వల్ల ఈ మ్యాచ్​కు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 59 మ్యాచ్​లు జరగ్గా భారత్ 21 మ్యాచ్​లు, న్యూజిలాండ్ 12 మ్యాచ్​ల్లో విజయం సాధించింది. 26 మ్యాచ్​లు డ్రాగా ముగిశాయి.

టాప్ ఇన్నింగ్స్

బ్యాట్​తో

భారత్​-ఇంగ్లాండ్ మధ్య టెస్టుల్లో రాహుల్ ద్రవిడ్ ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్​మన్. కివీస్​పై 15 మ్యాచ్​లాడి 63.80 సగటుతో 1659 పరుగులు నమోదు చేశాడు. ఇందులో ఆరు శతకాలు, ఆరు అర్ధశతకాలు ఉన్నాయి.

dravid
ద్రవిడ్

భారత్​పై టెస్టు​ల్లో కివీస్ తరఫున బ్రెండన్ మెక్​కలమ్ ఎక్కువ పరుగులు చేశాడు. మన జట్టుపై 10 మ్యాచ్లాడి 68 సగటుతో 1224 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, రెండు అర్ధశతకాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​ల్లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు సాధించాడు. కివీస్​పై 51.53 సగటుతో ఇప్పటివరకు 773 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు అర్ధశతకాలూ ఉన్నాయి. న్యూజిలాండ్ తరఫున రాస్ టేలర్​ ఎక్కువ పరుగులు చేశాడు. భారత్​పై 33.83 సగటుతో 812 పరుగులు నమోదు చేశాడు.

బంతితో

ఇరుజట్ల మధ్య పోరులో కివీస్ బౌలర్ రిచర్డ్ హెడ్లీ ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్​గా నిలిచాడు. కుడి చేతి పేసర్ అయిన ఇతడు 65 వికెట్లు పడగొట్టాడు. బిషన్ సింగ్ బేడీ(భారత్) 12 మ్యాచ్​ల్లో 57 వికెట్లు తీశాడు.

ashwin
అశ్విన్

ప్రస్తుత బౌలర్లలో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ భారత్​పై ఎక్కువ వికెట్లు తీసినవాడు. 8 మ్యాచ్​ల్లో 39 వికెట్లు దక్కించుకున్నాడు. భారత్ తరఫున అశ్విన్ కివీస్​పై 48 వికెట్లు పడగొట్టాడు.

భారత్-కివీస్ చివరి మ్యాచ్​ ఫలితం

గతేడాది ఓవల్ వేదికగా జరిగిన టెస్టులో టీమ్ఇండియాను మట్టికరిపించింది న్యూజిలాండ్. ఈ మ్యాచ్​ మూడురోజుల్లోనే ముగిసింది. ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మొదటి ఇన్నింగ్స్​లో 242 పరుగులకు ఆలౌటైంది. కివీస్ 235 పరుగులకే పరిమితమై టీమ్ఇండియాకు ఆధిపత్యం కట్టబెట్టింది. రెండో ఇన్నింగ్స్​లో సౌథీ, బౌల్ట్ రెచ్చిపోవడం వల్ల కోహ్లీసేన 124 పరుగులకే చాపచుట్టేసింది. ఈ ఇన్నింగ్స్​లో పుజారా చేసిన 24 పరుగులే అత్యధికం. అనంతరం 132 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది కివీస్.

Kohli, Williamson
కోహ్లీ, విలియమ్సన్

ఇవీ చూడండి: టీమ్ఇండియా లైనప్​పైనే అందరి దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.