ETV Bharat / sports

WTC Final: 'ప్రాక్టీసుకు టైమ్ లేకున్నా సరే గెలుస్తాం'

టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ కోసం ప్రాక్టీసు చేసేందుకు ఎక్కువ సమయం లేకున్నా గెలిచి తీరుతామని అశ్విన్ ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ పరిస్థితులకు టీమ్​ఇండియా త్వరగా అలవాటుపడుతుందని తెలిపాడు.

Ravichandran Ashwin
రవిచంద్రన్ అశ్విన్
author img

By

Published : Jun 2, 2021, 4:31 PM IST

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ ముందు ఎక్కువ అంతరం రావడం ఇబ్బందికరమేనని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడటం న్యూజిలాండ్‌కు ప్రయోజనమని తెలిపాడు. వారి ఆటను జాగ్రత్తగా పరిశీలిస్తే కోహ్లీసేనకు అదో పాఠం అవుతుందని పేర్కొన్నాడు. సాధనకు సమయం లేకున్నా ఆస్ట్రేలియాలో మాదిరిగా విజయం సాధిస్తామని వెల్లడించాడు.

Ravichandran Ashwin
అశ్విన్

‘మా తొలి సాధన శిబిరం ఆరంభమయ్యేందుకు కనీసం మరో వారం పది రోజులు పడుతుంది. ఐపీఎల్‌ వాయిదా పడ్డప్పటి నుంచి ఆటగాళ్లు క్రికెట్‌ ఆడలేదు. ఇది మాకు పెద్ద సవాలే. కానీ ఒక్కసారి ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టాక టీమ్‌ఇండియా త్వరగా పరిస్థితులకు అలవాటు పడగలదు. ఆస్ట్రేలియాలో మాదిరిగా ప్రదర్శనలు చేయగలదు’ అని అశ్విన్‌ అన్నాడు.

‘మ్యాచ్‌కు సన్నద్ధమవ్వడం, మ్యాచ్‌ కోసం సాధన చేయడం భిన్నమైనవి. ఐపీఎల్‌ వాయిదా పడ్డాక మేం ఇంగ్లాండ్‌ వెళ్తున్నాం. ఇంగ్లాండుతో ఆడే రెండు టెస్టులు కివీస్‌కు అనుభూతిని ఇస్తాయి. అదే సమయంలో వారి మ్యాచులు చూడటం మాకు విలువైన పాఠాలు అవుతాయి. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగే మ్యాచులు చూడటం, పాత వీడియోలు చూడటం ప్రయోజనకరం’ అని అశ్విన్ వెల్లడించాడు.

ప్రస్తుతం భారత జట్టు ముంబయిలో క్వారంటైన్‌లో ఉంది. ఇంగ్లాండ్‌ వెళ్లాక మళ్లీ మూడు రోజుల క్వారంటైన్‌లో ఉండి, ప్రాక్టీసు మొదలుపెడుతుంది.

team india
టీమ్​ఇండియా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.