WTC Final 2023 Teamindia vs Australia : టీమ్ఇండియా-ఆస్ట్రేలియా ఈ నెల 7 నుంచి WTC ఫైనల్లో తలపడనున్నాయి. ఓవల్ మదానం వేదికగా ఈ తుది పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌తో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ.. చెరో రికార్డును తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును అధిగమించనున్నారు.
Dhoni ICC Trophies : అదేంటంటే.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ.. భారత్ తరఫున అత్యధిక ఐసీసీ ట్రోఫీ ఫైనల్స్ ఆడిన రెండో ఆటగాడిగా ఉన్నాడు. కెరీర్‌లో మొత్తం ఐదు ఐసీసీ ఫైనల్స్ అడాడు. 2007లో తొలిసారి ఐసీసీ ఫైనల్ ఆడిన మహీ.. ఆ తర్వాత 2011 వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ ఆడాడు. వీటిలో మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్నాడు. 2007, 2011, 2013లో గెలుపొందాడు. ఇప్పుడు.. ధోనీ పేరిట ఉన్న అత్యధిక డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఘనతను వారు అధిగమించబోతున్నారు.
Kohli ICC Trophies : ప్రస్తుత వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. తమ కెరీర్‌లో 6వ ఐసీసీ ఫైనల్ ఆడబోతున్నారు. తద్వారా మహీని అధిగమించి రెండో స్థానాన్ని అందుకోబోతున్నారు. కోహ్లీ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ కాకుండా 2011లో తొలిసారి వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు. ఆ తర్వాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2014లో టీ20 ప్రపంచకప్, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ల్లోనూ బరిలోకి దిగాడు.
Rohith ICC Trophies : రోహిత్ శర్మ 2007 టీ20 ప్రపంచకప్‌తో మొదటి సారి ఐసీసీ ఫైనల్ బరిలోకి దిగాడు. ఆ తర్వాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ, 2014లో టీ20 ప్రపంచకప్, 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2021లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడాడు.
Yuvaraj Singh ICC Trophies : ఇక టీమ్ ఇండియా తరఫున అత్యధికంగా ఐసీసీ ఫైనల్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా మాజీ దిగ్గజ ప్లేయర్ యువరాజ్ సింగ్ అగ్ర స్థానంలో నిలిచాడు. 2000లో తొలిసారి ఐసీసీ ఫైనల్ ఆడిన యువరాజ్ సింగ్.. 2002 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2003 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వరల్డ్‌కప్, 2014 టీ20 వరల్డ్‌కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ.. మొత్తంగా 7 ఐసీసీ ఫైనల్స్ ఆడి ఈ మార్క్‌ను అందుకున్నాడు.
ఇకపోతే యూవీ, ధోనీ, కోహ్లీ, రోహిత్ తర్వాత... సచిన్ తెందుల్కర్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఆర్.అశ్విన్, రవీంద్ర జడేజా.. తలో 4 ఐసీసీ టోర్నీ ఫైనల్స్ బరిలో దిగారు.
ఇదీ చూడండి : WTC Final : 10 ఏళ్లలో 8 సార్లు.. రోహిత్ శర్మనైనా తీరుస్తాడా?
- ఈ బౌలర్లతో చాలా డేంజర్.. టీమ్ఇండియా స్టార్లు మళ్లీ వీళ్ల బుట్టలో పడతారా?
- WTC Final 2023 : కోహ్లీ X గిల్.. టాప్ స్కోరర్ ఎవరో?.. టీమ్ఇండియా గెలిస్తే నయా చరిత్ర!
- WTC Final 2023 : ఓవల్‌లో వారిదే ఆధిపత్యం.. టీమ్ఇండియా పేసర్లు ఏం చేస్తారో?
- WTC Final డ్రా అయితే విజేేత ఎవరు? వర్షం పడితే ఎలా? దాదా కామెంటరీ ఉందా?
- WTC Finalలో టీమ్ఇండియాకు బలం వీరే.. తుది జట్టు సంగతేంటి?