WTC Final 2023 : మొదటి డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య ఓటమి అందుకున్న టీమ్ఇండియా.. రెండో ప్రయత్నంలోనైనా టైటిల్ సాధించాలని భారత్ క్రికెటర్లతో పాటు అభిమానులు ఆశించారు. అయితే ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన భారత్‌కు.. ప్రస్తుత డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 తొలి రోజే నిరాశ ఎదురైంది. ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో మనోళ్లకు ఎదురు గాలి వీచింది.
Travis head vs India : వాస్తవానికి ఈ తుది పోరులో టాస్ మనదే.. ఆరంభం మనదే.. కానీ చివరికి ఆధిపత్యం మాత్రం ఆస్ట్రేలియాదే. మ్యాచ్‌ను మంచిగా ఆరంభించినప్పటికీ.. ఆ తర్వాత భారత్ పట్టువిడిచేసింది. ఆసీస్ బ్యాటర్లు చెలరేగిపోయారు. మూడో వికెట్ తర్వాత ఆట స్వరూపం మారిపోయింది. ట్రావిస్ హెడ్ (156 బంతుల్లో 146; 22×4, 1×6) సంచలన ప్రదర్శనతో మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ.. మ్యాచ్‌ను తమ వైపు తిప్పేసుకున్నాడు. అలాగే అతడికి.. ఎన్నో మ్యాచుల్లో భారత బౌలర్లకు సవాలుగా నిలిచిన స్టీవ్ స్మిత్ (227 బంతుల్లో 95; 14×4) నుంచి మంచిగా సహకారం అందింది. దీంతో మొదటి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 327/3తో ఆధిపత్యంలో నిలిచించి.
బౌలర్లను నిందించలేం.. మ్యాచ్ ఆరంభంలో ఆకట్టుకున్న భారత బౌలర్లు సిరాజ్ (1/67), షమి (1/77), శార్దూల్ (1/75) ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. కానీ భారత బౌలర్ల వైఫల్యాన్ని పూర్తిగా నిందించలేం. ఎందుకంటే.. ఓవల్ మైదానంలో మధ్యాహ్నం నుంచి బాగా ఎండ కాచింది. దీంతో పిచ్‌లో మార్పు వచ్చింది. పిచ్ పరిస్థితి బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలంగా మారిపోయింది. ఉదయం తరహా మధ్యాహ్నం సీమ్ కదలికలు అస్సలు కనపడలేదు. దీంతో బాల్ మనం అనుకున్నట్టుగా స్వింగ్ కాలేదు.
WTC final pitch 2023 : అయితే సెకండ్ డే మార్నింగ్ మళ్లీ పరిస్థితులు మారొచ్చు. ఫలితంగా బ్యాటింగ్ కష్టంగా మారొచ్చని అంచనా వేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన బౌలర్లు సాధ్యమైనంత త్వరగా.. ఎంత వేగంగా వికెట్లు తీస్తే అంత మంచిది. ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయాలి. లేదంటే భారత్.. మ్యాచ్‌పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఆసీస్ స్కోరు 450 దాటితే మాత్రం.. టీమ్ఇండియా డ్రా కోసం పోరాడాల్సి వస్తుంది. ఇక విజయం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి అస్సలు కనపడదు. ఆ తర్వాత భారత్ బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్ పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఎంతో కీలకంగా మారింది. ఏమాత్రం పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న మనోళ్లకు కఠిన సవాల్ ఎదురైనట్టే. ఎందుకంటే.. ఆ జట్టులో స్టార్క్, కమిన్స్, బోలాండ్ త్రయాన్ని ఎదుర్కోవడం చాలా కష్టమనే చెప్పాలి. కాబట్టి.. మన బ్యాటర్లు పట్టుదల ప్రదర్శించాలి. ముఖ్యంగా ఓపెనర్లు గట్టి ఆరంభాన్ని అందించాలి. ఆ తర్వాత వచ్చే వాళ్లు కూడా గట్టిగా రాణించాలి. ఇది జరగకపోతే.. ఆసీస్ జట్టు తక్కువ రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించేసి మనోళ్లను ఇంటికి పంపేస్తుంది.
ఇదీ చూడండి :
WTC Final : చెలరేగిన హెడ్, స్మిత్.. తొలి రోజు ఆట పూర్తి.. భారీ స్కోరు దిశగా ఆసీస్!
WTC Final 2023 : 'మ్యాచ్ విన్నర్‌ను ఎలా పక్కన పెడతారు?'.. రోహిత్‌పై నెటిజన్లు ఫుల్ ఫైర్!