ETV Bharat / sports

WTC Final IND VS AUS : ఐసీసీ ఫైనల్స్​లో ఎవరెన్ని గెలిచారంటే? - icc finals teamindia records

WTC Final 2023 Teamindia VS Australia : వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ 2023 ఇంకో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్ని ఐసీసీ ఫైనల్‌ మ్యాచ్‌లు జరిగాయి? అందులో టీమ్​ఇండియా, ఆస్ట్రేలియా.. ఎన్ని ఫైనల్స్‌ ఆడాయి (వేర్వేరుగా, కలిసి).. వాటిలో భారత్‌ ఎన్ని సార్లు విజయం సాధించింది, ఆస్ట్రేలియా ఎన్ని సార్లు గెలిచింది? వంటి వివరాలను తెలుసుకుందాం..

WTC Final
WTC Final IND VS AUS : ఐసీసీ ఫైనల్స్​లో ఎవరెన్ని గెలిచారంటే?
author img

By

Published : Jun 5, 2023, 7:27 AM IST

WTC Final 2023 Teamindia VS Australia : ఇంకో రెండు రోజుల్లో వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ 2023 ప్రారంభం కానుంది. దీని కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ తుది పోరులో పోటీపడబోయే టీమ్‌ఇండియా-ఆస్ట్రేలియా జట్లు ఉత్సాహంగా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఎన్ని ఐసీసీ ఫైనల్‌ మ్యాచ్‌లు జరిగాయి? అందులో టీమ్​ఇండియా, ఆస్ట్రేలియా.. ఎన్ని ఫైనల్స్‌ ఆడాయి (వేర్వేరుగా, కలిసి).. వాటిలో భారత్‌ ఎన్ని సార్లు విజయం సాధించింది, ఆస్ట్రేలియా ఎన్ని సార్లు గెలిచింది? వంటి విషయాలను తెలుసుకుందాం..

ICC Finals : ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఆధ్వర్యంలో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు మొత్తం 29 ఫైనల్‌ మ్యాచ్‌లు జరిగాయి. వన్డే వరల్డ్‌కప్‌ (12), టీ20 వరల్డ్‌కప్‌ (8), డబ్ల్యూటీసీ (1), ఛాంపియన్స్‌ ట్రోఫీ (8) జరిగాయి. అందులో టీమ్​ఇండియా 10 ఫైనల్​ మ్యాచులు ఆడి.. ఐదింటిలో విజయం సాధించింది. ఆస్ట్రేలియా 11 ఫైనల్స్​లో బరిలోకి దిగి .. ఎనిమిది విజయాలను తన ఖాతాలో వేసుకుంది.

టీమ్​ఇండియా ఆడిన ఐసీసీ ఫైనల్స్‌(ICC Finals Teamindia)

  • 1983 వన్డే వరల్డ్‌కప్‌లో విండీస్‌పై టీమ్​ఇండియా విజయం సాధించింది.
  • 2000 ఛాంపియన్స్‌ ట్రోఫీలో న్యూజిలాండ్‌పై భారత్‌ ఓటమిని అందుకుంది.
  • 2002 ఛాంపియన్స్‌ ట్రోఫీలో శ్రీలంకతో పాటు సంయుక్తంగా విజేతగా నిలిచింది భారత్​.
  • 2003 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమ్​ఇండియా ఓడిపోయింది.
  • 2007 టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్​పై గెలిచింది.
  • 2011 వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై గెలిచింది.
  • 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.
  • 2014 టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది.
  • 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్​పై ఓటమిని అందుకుంది.
  • 2021 డబ్ల్యూటీసీలో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోయింది.

ఆస్ట్రేలియా బరిలో దిగిన ఐసీసీ ఫైనల్స్‌ ఇవే(ICC Finals Australia)

  • 1975 వన్డే వరల్డ్‌కప్‌లో విండీస్ చేతిలో ఓడిపోయింది.
  • 1987 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్​పై విజయం సాధించింది.
  • 1996 వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై ఓడిపోయింది.
  • 1999 వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్​పై గెలుపొందింది.
  • 2003 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌పై గెలిచింది.
  • 2006 ఛాంపియన్స్‌ ట్రోఫీలో వెస్టిండీస్‌పై విజయం సాధించింది.
  • 2007 వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై విజయం సాధించింది.
  • 2009 ఛాంపియన్స్‌ ట్రోఫీలో న్యూజిలాండ్‌‌పై విజయాన్ని అందుకుంది.
  • 2010 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్​ చేతిలో ఓడిపోయింది.
  • 2015 వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై గెలిచింది.
  • 2021 టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై విజయాన్ని అందుకుంది.

ఇదీ చూడండి : WTC Final : భారత్‌కు వీరు.. ఆసీస్‌కు వారు.. ఇరు జట్లలో ఎవరిదో పైచేయి?

WTC Final : 10 ఏళ్లలో 8 సార్లు.. రోహిత్​ శర్మనైనా తీరుస్తాడా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.