హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లర్ సుశీల్ కుమార్.. చివరి లొకేషన్ పంజాబ్‌లోని భఠిండాలో కనుగొన్నట్లు దిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. అతడి కోసం హరియాణా, పంజాబ్‌లలో పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు పేర్కొన్నాయి. మే 4న ఛత్రశాల్ స్టేడియంలో మల్లయోధుడు సాగర్ రానా హత్య జరిగిన నాటి నుంచి సుశీల్ పరారీలో ఉన్నాడు.
ఇటీవల దిల్లీ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం సుశీల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ వ్యాజ్యాన్ని తిరస్కరించింది న్యాయస్థానం. ఈ కేసులో సుశీల్ ప్రధాన నిందితుడన్న ఆరోపణలు బలంగా ఉండడం వల్ల అతడికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
అంతకుముందు సుశీల్ ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డును ప్రకటించారు పోలీసులు. అతనితో పాటు మరో నిందితుడు అజయ్ కుమార్ కూడా పరారీలో ఉన్నాడు. అతనిపై కూడా రూ.50వేల రివార్డు ఉంది.
ఇదీ చదవండి: భారత బాక్సర్ల విమానం ల్యాండింగ్‌కు దుబాయ్ నో!