ACC Womens Emerging Teams Asia Cup 2023 : హాంకాంగ్ వేదికగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించిన ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్- 2023 ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 31 పరుగుల తేడాతో గెలుపొందింది. బుధవారం జరిగిన ఈ పోరులో భారత మహిళల 'ఏ' జట్టు బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఫైనల్లో భారత ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్ విరాట్ కోహ్లీని ఇమిటేట్ చేస్తూ సెలబ్రేషన్ చేసుకుంది. అహుజా బౌలింగ్‌లో శోభానా మోస్తరీ క్యాచ్ పట్టిన తర్వాత సంతోషంతో మైదానంలో విరాట్ కోహ్లీలా సంబరాలు చేసుకుంది. ఈ గెలుపుపై ఆమె విరాట్‌ను ఇమిటేట్ చేస్తూ స్పందించిన తీరును చూసిన కొందరు నెటిజన్లు పాటిల్‌లో ఏమైనా క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ పూనాడా అంటూ సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.
-
pic.twitter.com/YYRp0ahpRj i'm going to be so insufferable about shreyanka patil in coming days, just thought i'd let you know
— s (@_sectumsempra18) June 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">pic.twitter.com/YYRp0ahpRj i'm going to be so insufferable about shreyanka patil in coming days, just thought i'd let you know
— s (@_sectumsempra18) June 21, 2023pic.twitter.com/YYRp0ahpRj i'm going to be so insufferable about shreyanka patil in coming days, just thought i'd let you know
— s (@_sectumsempra18) June 21, 2023
మహిళల ప్రీమియర్ లీగ్‌లో శ్రేయాంక పాటిల్ ఆర్సీబీ తరఫున ఆడుతోంది. విరాట్ కోహ్లీ అంటే ఆమెకు అత్యంత అభిమానం. విరాట్‌ను తాను క్రికెట్ దేవుడిలా ఆరాధిస్తానని శ్రేయాంక పాటిల్ గతంలో తెలిపింది. బంగ్లాదేశ్‌తో ఫైనల్ మ్యాచ్ తర్వాత కూడా విరాట్‌పై తన అభిమానాన్ని ఒలకబోసింది. కోహ్లీలా దూకుడుగా సంబరాలు చేసుకోవడంపై స్పందించింది. చిన్నప్పటి నుంచి విరాట్‌ను చూసి పెరిగానని.. అందుకే దూకుడు స్వభావం ఆటోమెటిక్‌గా వచ్చేసిందని చెప్పుకొచ్చింది. ఒత్తిడిలో ఆడటం అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొంది.
-
"I have been watching Virat Kohli since I was a kid"
— KT (@IconicRcb) June 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Virat is like god of cricket for me, Inspiration for millions. King 👑
~ Shreyanka Patilpic.twitter.com/FYedmYp95K
">"I have been watching Virat Kohli since I was a kid"
— KT (@IconicRcb) June 21, 2023
Virat is like god of cricket for me, Inspiration for millions. King 👑
~ Shreyanka Patilpic.twitter.com/FYedmYp95K"I have been watching Virat Kohli since I was a kid"
— KT (@IconicRcb) June 21, 2023
Virat is like god of cricket for me, Inspiration for millions. King 👑
~ Shreyanka Patilpic.twitter.com/FYedmYp95K
ఇదిలా ఉంటే వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. భారత జట్టు తరఫున విృందా దినేశ్ 29 బంతుల్లో 36 పరుగులు, కనికా అహుజా 23 బంతుల్లో 30 పరుగులతో రాణించారు. బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోయినా బౌలింగ్‌లో మాత్రం టీమ్ఇండియా ఆటగాళ్లు విజృంభించారు. యువ స్పిన్నర్, ఆల్ రౌండర్ శ్రేయాంక పాటిల్ మరోసారి తన బౌలింగ్ పటిమను చూపించి నాలుగు వికెట్లు పడగొట్టింది.
అటు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న అహుజా బౌలింగ్‌లోనూ రాణించి 4 ఓవర్లలో 23 పరుగులుచ్చి రెండు వికెట్లు తీసింది. మన్నత్ కశ్యప్ 3 వికెట్లు, టిటాస్ సాధు ఒక వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో కేవలం 96 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో నహిదా అక్తర్ (17)దే అత్యధిక స్కోరు. అద్భుత ప్రదర్శనను కనబరిచిన ఆల్ రౌండర్ శ్రేయాంక్ పాటిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. 20 ఏళ్ల పాటిల్ ఈ టోర్నమెంట్‌లోని రెండు మ్యాచ్‌లలో కేవలం 7 ఓవర్లలో 9 వికెట్లు తీసింది. ఆమె వేసిన బౌలింగ్‌లో పరుగుల సగటు 1.67 పరుగులుగా ఉండగా 42 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే ప్రత్యర్థి జట్టుకిచ్చింది.
ఈ సిరీస్‌లో హాంకాంగ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో శ్రేయాంక పాటిల్ మూడు ఓవర్లు వేసింది. ఇందులో ఓ మెయిడిన్ చేయడమే కాకుండా రెండు పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టింది. ఆమె ఇచ్చిన రెండు పరుగులలో ఒకటి వైడ్ రూపంలోనే రావడం గమనార్హం. కాగా, ఈ టోర్నీలో భారత్ సహా యూఏఈ, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, పాకిస్థాన్, నేపాల్, హాంకాంగ్ దేశాలు పాల్గొన్నాయి.