ETV Bharat / sports

WPL 2023: విజృంభించిన దిల్లీ క్యాపిటల్స్​.. ముంబయి ఇండియన్స్​పై విజయం - దిల్లీ క్యాపిటల్స్​పై ముంబయి ఇండియన్​ ఓటమి

డబ్ల్యూపీఎల్‌ 2023లో భాగంగా నేడు(మార్చి 20) జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​పై దిల్లీ క్యాపిటల్స్​ విజయం సాధించింది. ఆ మ్యాచ్ వివరాలు..

WPL 2023: ముంబయి ఇండియన్స్​పై దిల్లీ విజయం

author img

By

Published : Mar 20, 2023, 9:57 PM IST

Updated : Mar 20, 2023, 10:37 PM IST

డబ్ల్యూపీఎల్‌ 2023లో భాగంగా ముంబయి ఇండియన్స్​ మరో ఓటమిని చవి చూసింది. దిల్లీ క్యాపిటల్స్‌తో ఆడిన మ్యాచ్​లో తొమ్మిది వికెట్ల తేడాతో ఓడింది. 110 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ క్యాపిటల్స్​.. తొమ్మిది ఓవర్లలోనే వికెట్ నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. మెగ్​ లాన్నింగ్​(32*), అలీస్​ క్యాప్సీ(38*), షెపాలీ వర్మ(33) ఇన్నింగ్స్​ను ముగించారు. లక్ష్య ఛేదన ప్రారంభించిన దిల్లీ టీమ్​ను ముంబయి ఏ దశలోనూ అడ్డుకోలేక పోయింది. బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ పరుగుల వరద పారించారు. వచ్చినా బంతిని ఎడాపెడా బాదేశారు. అయితే జట్టు స్కోరు 56 రన్స్​ దగ్గర.. మ్యాథ్యూస్‌ వేసిన 4.3 ఓవర్​ బంతికి షఫాలీ వర్మ స్టంప్​ ఔట్​గా వెనుదిరిగింది. ముంబయి బౌలర్లలో సైకా ఇషాక్‌ రెండు ఓవర్లల్లో ఏకంగా 36 పరుగులను సమర్పించుకుంది. హెయిలీ మ్యాథ్యూస్‌ (27/1), వాంగ్‌ (20/0), బ్రంట్‌ (21/0) రన్స్​ ఇచ్చుకున్నారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబయి టీమ్​ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (23), పూజా వస్త్రాకర్‌ (26), వాంగ్ (23), అమన్‌జోత్‌ కౌర్‌ (19) తప్ప మిగతా బ్యాటర్లందరూ సింగిల్‌ డిజిట్‌ స్కోరు మాత్రమే చేశారు. బ్యాటింగ్‌ ఆరంభంలోనే ముంబయికి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు యాస్తికా భాటియా (1), హెయిలీ మ్యాథ్యూస్‌ (5) తక్కువ స్కోరు చేసి నిరాశపరిచారు. మరిజన్నె వేసిన మూడో ఓవర్‌ ఫస్ట్ బాల్​కే తనియా భాటియాకు క్యాచ్‌ ఇచ్చి యాస్తికా భాటియా ఔట్ అయింది. ఆ తర్వాతి బాల్​కే ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన బ్రంట్‌(0) పరుగులు చేయకుండానే వెనుదిరిగింది. అలా టీమ్​ స్కోరు 10 పరుగుల వద్ద షిఖాపాండే వేసిన నాలుగో ఓవర్‌ మూడో బంతికి ఓపెనర్‌ హెయిలీ మ్యాథ్యూస్‌ పెవిలియన్ చేరింది. రోడ్రిగ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయింది. అనంతరం కెప్టెన్ హర్మన్‌ ప్రీత్ కౌర్‌ ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత అమీలా కేర్‌ (8) కూడా తక్కువ స్కోరుకే ఔటైపోయింది. ఆ తర్వాత పూజా వస్త్రాకర్‌, ఓవగ్‌, అమన్‌జోత్‌ కౌర్‌ పర్వాలేదనే ప్రదర్శనతో స్కోరు బోర్డును కాస్త ముందుకు తీసుకెళ్లారు. దిల్లీ బౌలర్లలో మరిజన్నె, షిఖా పాండే,జోనాసేన్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అరుంధతి రెడ్డి ఒక వికెట్‌ తీసింది.

ఇకపోతే ఈ మ్యాచ్​ ఫలితంతో సంబంధం లేకుండానే ఇప్పటికే ముంబయి ఇండియన్స్​, దిల్లీ క్యాపిటల్స్​ ప్లే ఆఫ్స్​కు బెర్త్ సాధించాయి. ఈ రెండు టీమ్​లతో పాటు యూపీ వారియర్స్​.. పాయింట్ల పట్టికలో టాప్​-3లో ఉన్నాయి. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్​ లీగ్​ నుంచి వైదొలిగాయి.

ఇదీ చూడండి: హాలీడే ట్రిప్​లో చాహల్ భార్య ​.. అదిరిపోయే పోజుల్లో ఫొటోలు..

Last Updated : Mar 20, 2023, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.