టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిపై వచ్చే మీమ్స్‌కు (Ravi Shastri Memes) ఉండే క్రేజే వేరు. శాస్త్రి చేతుల్లో మందు సీసా, గ్లాసులు లేదా ఐస్ పెట్టి ఫొటోషాప్ చేసిన మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. అతడు తరచూ మద్యం మత్తులో ఉంటాడనే అర్థం వచ్చే చేసే మీమ్స్ నెటిజన్లను చాలావరకు అలరిస్తాయి. అయితే కొన్నిసార్లు టీమ్ఇండియా వైఫల్యాలకు అతడే కారణం అని వచ్చేలా కూడా ఉంటాయి. టీ20 ప్రపంచకప్‌తో (T20 World Cup 2021) ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి శకం ముగిసింది. ఈ నేపథ్యంలోనే మీమ్స్ పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శాస్త్రి (Ravi Shastri News).
"వాటిల్లో (మీమ్స్) కొన్నింటిని ఆస్వాదిస్తాను. అది కూడా ప్రతిభే. ఒక్కసారిగా నన్ను ట్రోల్ చేస్తారు. మరుసటి రోజే అది కనుమరుగైపోతుంది. కఠిన సమయాల్లో ప్రజలకు మీమర్స్ నవ్వులు పంచుతున్నారు. వారిలో కొందరిని డ్రింక్స్ కోసం ఆహ్వానించాలనుకుంటున్నాను"
- రవిశాస్త్రి, టీమ్ఇండియా మాజీ కోచ్
శాస్త్రి హయాంలో టీమ్ఇండియా ఎన్నో మధురమైన టెస్టు విజయాలను అందుకుంది. ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేదనే నిరాశే తప్ప జట్టును అగ్రస్థానంలో నిలబెట్టారు. తన పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు శాస్త్రి.
-
The Alcohol meme era comes to an end @RaviShastriOfc. pic.twitter.com/HBh9Rx1W1t
— Amit Kumar Gupta (@amitgupta0310) November 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Alcohol meme era comes to an end @RaviShastriOfc. pic.twitter.com/HBh9Rx1W1t
— Amit Kumar Gupta (@amitgupta0310) November 8, 2021The Alcohol meme era comes to an end @RaviShastriOfc. pic.twitter.com/HBh9Rx1W1t
— Amit Kumar Gupta (@amitgupta0310) November 8, 2021
-
Most people (including me) criticise him a lot when India loses, but little is he appreciated when India wins.
— Kalp Chopra 🇮🇳 (@ChopraKalp) November 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Thank you for your services @RaviShastriOfc.
And of course, we'll miss your hilarious reactions and the memes 🤪#RaviShastri #IndianCricketTeam pic.twitter.com/gz1ici0QQo
">Most people (including me) criticise him a lot when India loses, but little is he appreciated when India wins.
— Kalp Chopra 🇮🇳 (@ChopraKalp) November 8, 2021
Thank you for your services @RaviShastriOfc.
And of course, we'll miss your hilarious reactions and the memes 🤪#RaviShastri #IndianCricketTeam pic.twitter.com/gz1ici0QQoMost people (including me) criticise him a lot when India loses, but little is he appreciated when India wins.
— Kalp Chopra 🇮🇳 (@ChopraKalp) November 8, 2021
Thank you for your services @RaviShastriOfc.
And of course, we'll miss your hilarious reactions and the memes 🤪#RaviShastri #IndianCricketTeam pic.twitter.com/gz1ici0QQo
-
Ravi Shastri's feelings nowadays:#memesdaily #MEMES pic.twitter.com/BdNM3ywc51
— Prakhar (@prakhar_memes) April 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ravi Shastri's feelings nowadays:#memesdaily #MEMES pic.twitter.com/BdNM3ywc51
— Prakhar (@prakhar_memes) April 28, 2020Ravi Shastri's feelings nowadays:#memesdaily #MEMES pic.twitter.com/BdNM3ywc51
— Prakhar (@prakhar_memes) April 28, 2020
-
Ravi Shastri and Daaru memes never gets enough of them 😂😅🤣 #RaviShastri pic.twitter.com/RJYO3ujqqs
— gautam (@gautam07MSDian) March 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ravi Shastri and Daaru memes never gets enough of them 😂😅🤣 #RaviShastri pic.twitter.com/RJYO3ujqqs
— gautam (@gautam07MSDian) March 2, 2021Ravi Shastri and Daaru memes never gets enough of them 😂😅🤣 #RaviShastri pic.twitter.com/RJYO3ujqqs
— gautam (@gautam07MSDian) March 2, 2021
మళ్లీ వ్యాఖ్యాతగా!
టీమ్ఇండియా జట్టుకు హెడ్ కోచ్ కావడానికి ముందు రవిశాస్త్రి వ్యాఖ్యాతగా పనిచేశాడు. 2011లో టీమ్ఇండియా ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా కామెంట్రీ చేశాడు శాస్త్రి. 'ధోనీ ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్. ఇండియా లిఫ్ట్ ద వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్(తనదైన శైలిలో ధోనీ ఆటను ముగించాడు, టీమ్ఇండియా 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ అందుకుంది)' అని శాస్త్రి చెప్పిన మాటలు క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.
ఆ తర్వాత కోచ్ పదవి చేపట్టడం వల్ల కామెంటరీకి దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ తన పాత బాధ్యతల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన భారత్-ఇంగ్లాండ్ చివరి టెస్టు(IND vs ENG 5th test) వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇటీవలే పేర్కొంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఈ మ్యాచ్‌తో రవిశాస్త్రి వ్యాఖ్యాతగా రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి.
అత్యుత్తమ సేవలిందించా..
టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా అత్యుత్తమ సేవలందించేందుకు ప్రయత్నించానని రవిశాస్త్రి చెప్పాడు. టీమ్ఇండియా, విదేశాల్లో ఎన్నో విజయాలు సాధించిందని హర్షం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాను తమ సొంత గడ్డపైనే భారత్ ఓడించిందని, ఇంగ్లాండ్ సిరీస్‌లోను అధిక్యంలో ఉందని పేర్కొన్నాడు.
ఇవీ చూడండి:
మీ సహకారం చరిత్రలో నిలిచిపోతుంది: కోహ్లీ