World's Most Admired Person: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరాధ్య వ్యక్తుల జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్కు పన్నెండో స్థానం దక్కింది. కేవలం ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. లియోనల్ మెస్సీ, రొనాల్డో తర్వాత ప్రపంచవ్యాప్తంగా సచిన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తేలింది. 'యూ గౌవ్'(YouGov) అనే ఇంటర్నెట్ ఆధారిత మార్కెట్ రీసెర్చ్ అండ్ డేటా అనలిటిక్స్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Sachin News Today: దాదాపు 38 దేశాల్లో 42 వేల మందిపై ఈ సర్వే నిర్వహించింది యూ గౌవ్ సంస్థ. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే సచిన్నే ఎక్కువ మంది ఆరాధిస్తున్నారని సర్వేలో తేలింది. ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ కంటే సచిన్ ముందున్నాడు.
సచిన్ 'యూనిసెఫ్'తో దశాబ్దానికి పైగా అనుబంధం కలిగి ఉన్నాడు. 2013లో దక్షిణాసియా రాయబారిగా కూడా నియమితులయ్యాడు. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఆరోగ్యం, విద్య, క్రీడా రంగంలో అనేక సేవా కార్యక్రమాలకు మద్దతునిస్తున్నాడు.
ఇదీ చదవండి: