WTC Final 2023 IND VS AUS : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023(డబ్ల్యూటీసీ) ప్రారంభమైంది. వరుసగా రెండోసారి ఈ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్‌ఇండియా.. ఎలాగైనా గెలిచి గదను అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది.
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చాడు. వికెట్‌కీపర్‌గా కేఎస్ భరత్ బరిలోకి దిగనున్నాడు. మరోవైపు ఆసీస్ సైతం నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. గ్రీన్, కమిన్స్, స్టార్క్, బోలండ్ తుది జట్టులో ఉన్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా నాథన్ లియోన్‌ను ఆసీస్ బరిలోకి దించింది.
కెప్టెన్ల హాఫ్ సెంచరీ
ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు మరొక ప్రత్యేకత ఉంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్‌కు ఇది తమ కెరీర్‌లో 50వ టెస్టు కావడం విశేషం. ఒకేసారి ఇద్దరూ కెప్టెన్లూ ఇలా మైలురాయిని చేరుకోవడం ఇదే తొలిసారేమో..
-
🚨 Milestone Alert 🚨
— BCCI (@BCCI) June 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations to #TeamIndia Captain @ImRo45 on a special half-century 😃#WTC23 pic.twitter.com/B9LZKkK7o4
">🚨 Milestone Alert 🚨
— BCCI (@BCCI) June 7, 2023
Congratulations to #TeamIndia Captain @ImRo45 on a special half-century 😃#WTC23 pic.twitter.com/B9LZKkK7o4🚨 Milestone Alert 🚨
— BCCI (@BCCI) June 7, 2023
Congratulations to #TeamIndia Captain @ImRo45 on a special half-century 😃#WTC23 pic.twitter.com/B9LZKkK7o4
పిచ్ ఎక్కువగా మారదు: రోహిత్ శర్మ
ఓవల్ మైదానం పరిస్థితులకు అనుగుణంగా తుది జట్టును ఎంపిక చేసుకున్నాం. పిచ్ మరీ ఎక్కువగా మారుతుందని అనుకోవడం లేదు. నాణ్యమైన క్రికెట్‌ను ఆడతాం. నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగుతున్నాం. జడేజా వచ్చాడు. అయితే, అశ్విన్ వంటి అనుభవ బౌలర్ లేకుండా ఆడటం కష్టమే. మాకు అతడు మ్యాచ్ విన్నరే. రహానె అనుభవం మాకు అక్కరకొస్తుంది.
అతడు కీలకమవుతాడు: కమిన్స్
WTC Final 2023 : మేం కూడా తొలుత బౌలింగ్ చేయాలని భావించాం. నాలుగు, ఐదు రోజుల్లో బంతి టర్న్ అవుతుందని అనిపిస్తోంది. మా బౌలర్ స్కాట్ బొలాండ్ కీలకంగా మారతాడు. అతడే మా ప్రధాన ఆయుధం. గత పది రోజుల నుంచి ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డాం. వాతావరణం చాలా బాగుంది. ఒక్క సెషన్ కూడా మిస్ కాలేదు.
తుది జట్లు..
టీమ్‌ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, షమీ, సిరాజ్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ గ్రీన్ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, స్కాట్ బొలాండ్
-
Playing XIs for the #WTC23 Final 👀
— ICC (@ICC) June 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
📝: https://t.co/5IR0QKx6Pf pic.twitter.com/ngDIAC8HG7
">Playing XIs for the #WTC23 Final 👀
— ICC (@ICC) June 7, 2023
📝: https://t.co/5IR0QKx6Pf pic.twitter.com/ngDIAC8HG7Playing XIs for the #WTC23 Final 👀
— ICC (@ICC) June 7, 2023
📝: https://t.co/5IR0QKx6Pf pic.twitter.com/ngDIAC8HG7
మరో 27 పరుగులు చేస్తే.. ఇప్పటివరకు 49 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు.. 45.7 యావరేజ్‌తో 3379 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 14 అర్ధశతకాలు ఉన్నాయి. ఈ ఫైనల్‌లో రోహిత్ మరో 27 పరుగులు చేస్తే అంతర్జాతీయ మ్యాచుల్లో 13 వేల పరుగులు పూర్తి చేసిన మూడో భారత ఓపెనర్‌గా రికార్డు కెక్కుతాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్(15758) అగ్రస్థానంలో ఉండగా.. సచిన్ (15335) రెండో స్థానంలో ఉన్నాడు.
రహానే బర్త్‌డే సెలబ్రేషన్స్..
Rahane Birthday : అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు.. టీమ్ఇండియా క్రికెటర్లు అజింక్య రహానే బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. అందరూ కలిసి కేక్‌ను రహానే మొహం నిండా రాసేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. 'అది పోవాలంటే చాలా కష్టపడి క్లీన్ చేయాలి రహానే' అని ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ తెగ నవ్వుకుంటున్నారు. తాము కూడా బర్త్ డేలు ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటామని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇషాన్ కిషన్, పుజారా.. రహానే మొహానికి కేక్‌తో మేకప్ వేస్తూ ఈ ఫొటోల్లో కనిపించారు.
-
Happy birthday, @ajinkyarahane88 🎂 That will take some cleaning 😆😆 #TeamIndia pic.twitter.com/MgEMLzdiBr
— BCCI (@BCCI) June 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy birthday, @ajinkyarahane88 🎂 That will take some cleaning 😆😆 #TeamIndia pic.twitter.com/MgEMLzdiBr
— BCCI (@BCCI) June 6, 2023Happy birthday, @ajinkyarahane88 🎂 That will take some cleaning 😆😆 #TeamIndia pic.twitter.com/MgEMLzdiBr
— BCCI (@BCCI) June 6, 2023
అయితే దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రహానే.. గాయంతో దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో పునరగామనం చేశాడు. దేశవాళీల్లో చక్కగా రాణించిన రహానే.. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో కూడా అదరగొట్టాడు. అందుకే అతనికి టీమ్ఇం డియా నుంచి మళ్లీ పిలుపు దక్కింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా రహానే ఇదే జోరు కొనసాగించి జట్టుకు మంచి స్కోరు అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.