World Cup 2023 Tickets : భారత్ వేదికగా అక్టోబరు, నవంబరు మధ్య ఐసీసీ వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. ఇక ఈ మెగా టోర్నీలో భాగంగా జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల విక్రయం ఆగస్టు 25నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ, బీసీసీఐ వెల్లడించాయి. ఈ క్రమంలో టికెట్లు కావాలనుకునేవారు ఆగస్టు 15 నుంచి https://www.cricketworldcup.com/register అనే పేజీలో రిజిస్టర్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఒకవేళ రిజిస్టర్ చేసుకుంటే అందరికంటే ముందే టికెట్లకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. అయితే ఇందులో E-Ticket ఆప్షన్ లేదని, అభిమానులు నేరుగా బాక్స్ ఆఫీస్ కౌంటర్ల నుంచి టికెట్లను పొందాల్సి ఉంటుందని వెల్లడించారు.
ఆగస్టు 25న నాన్ ఇండియా వార్మప్ మ్యాచ్‌లు, నాన్ ఇండియా మ్యాచ్‌ల టికెట్లు విక్రయాలు మొదలవుతాయని బీసీసీఐ తెలిపింది. ఈ క్రమంలో భారత్ మినహా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ మ్యాచ్‌ల టికెట్లు విక్రయాలు ప్రారంభమవుతాయని తెలిపింది. భారత్ ఆడే వార్మప్ మ్యాచ్‌లు, వరల్డ్ కప్ మ్యాచ్‌లకు సంబంధించి ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు విక్రయాలు జరుగుతాయి. సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ల టికెట్లు సెప్టెంబర్ 15 నుంచి అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 14న జరిగే ఇండియా -పాకిస్థాన్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు ఆగస్టు 30 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి.
World Cup 2023 Tickets Sale : టికెట్ల విక్రయం తేదీలు..
ఆగస్టు 25 | నాన్-ఇండియా వార్మప్ మ్యాచ్‌లు, అన్ని నాన్-ఇండియా ఈవెంట్ మ్యాచ్‌లు |
ఆగస్టు 30 | గుహవాటి, తిరువనంతపురంలో భారత్ మ్యాచ్‌లు |
ఆగస్టు 31 | చెన్నై, దిల్లీ, పుణెలో భారత్ మ్యాచ్‌లు |
సెప్టెంబర్ 1 | ధర్మశాల, లఖ్‌నవూ, ముంబయిలో భారత్ మ్యాచ్‌లు |
సెప్టెంబర్ 2 | బెంగళూరు, కోల్‌కతాలో భారత్ మ్యాచ్‌లు |
సెప్టెంబర్ 3 | అహ్మదాబాద్‌లో భారత్ మ్యాచ్‌లు |
సెప్టెంబర్ 15 | సెమీ ఫైనల్స్, ఫైనల్ |
ICC World Cup 2023 First Match Venue : భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ తేదీలు ఖరారయ్యాయి. అక్టోబర్ 5న ప్రారంభమ్యే ఈ మెగా సమరం నవంబర్ 19న ముగియనుంది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం ఆయా వేదికల వద్ద సన్నాహకాలు జరుగుతుండగా ఈ టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లు.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్.. రన్నరప్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది.
ICC World Cup 2023 : 9 మ్యాచులు రీషెడ్యూల్.. భారత్-పాక్ మ్యాచ్ డేట్ ఫిక్స్