ETV Bharat / sports

ఆసియా కప్​కు నో.. కానీ వరల్డ్​ కప్​లోకి ఎంట్రీ? - ప్రపంచ కప్​ 2023 లేటెస్ట్ న్యూస్

చైనాలోని హాంగ్‌జౌ వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు అట్టహాసంగా జరగనుంది. ఈ క్రమంలో యంగ్​ ప్లేయర్స్​తో కూడిన ఓ జట్టును చైనాకు పంపిచనుంది బీసీసీఐ. అయితే అప్పట్లో కొంత మందిని ఈ జట్టులోకి తీసుకుంటుదని ఆశించినప్పటికీ వారి పేర్లు తుది లిస్ట్​లో కనిపించలేదు. కానీ ఇప్పుడు ఆ పేర్లు ప్రపంచ కప్​ లిస్ట్​లో కనిపించనుందట. ఇంతకీ వారెవరంటే..

icc mens world cup 2023
icc mens world cup 2023
author img

By

Published : Jul 19, 2023, 8:14 AM IST

Updated : Jul 19, 2023, 8:53 AM IST

Asia Games 2023 Cricket : కొవిడ్​ కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన ఆసియా క్రీడలు త్వరలో ప్రారంభం కానున్నాయి. చైనాలోని హాంగ్‌జౌ వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు అట్టహాసంగా జరగనుంది. అయితే ఈ సారి ఈ కీడల్లో క్రికెట్​ కూడా ఓ భాగమైంది. దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఎప్పుడో విడుదలవ్వగా.. బీసీసీఐ తాజాగా చైనాకు పయనమవ్వనున్న తుది జట్టును కూడా వెలువరించింది. టీ20 ఫార్మాట్‌లో నిర్వహించనున్న ఈ మ్యాచ్​లకు టీమ్​ఇండియా యంగ్​ ప్లేయర్​ రుతురాజ్​ గైక్వాడ్​ సారధ్యం వహించనున్నాడు.

అక్టోబర్ 5న ఐసీసీ ప్రపంచకప్​ జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ టీమ్ఇండియా జట్లను ఇలా వేర్వేరుగా ప్రకటించింది. దీంతో యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ , వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్​ కుమార్, శివం మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్​ లాంటి యంగ్​ ప్లేయర్స్​ అందరూ ఆసియా క్రీడల్లో జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు. అయితే అప్పట్లో తుది జట్టు కోసం కొంత మంది ప్లేయర్స్​ను ఎంచుకున్న బీసీసీఐ.. కొన్ని అనివార్య కారణాల వల్ల వారిని ఆఖరిలో తీసుకోలేదు. కానీ తాజాగా వెలువరిన సమాచారం ప్రకారం ఆసియా క్రీడల జట్టు నుంచి మినహాయించిన కొంతమంది ఆటగాళ్లు ప్రపంచ కప్​కు సెలెక్ట్​ అయ్యే అవకాశాలున్నాయట. దీంతో వీరు వరల్డ్​ కప్​ టీమ్​లోకి వైల్డ్​ కార్డ్​ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ వారెవరంటే..

శార్దూల్​ ఠాకూర్​
వన్డే మ్యాచుల్లో శార్దూల్ ఠాకూర్​ గణాంకాలు సుమారుగానే ఉన్నాయి. ఆడిన 35 మ్యాచుల్లో ఈ ప్లేయర్​.. 50 వికెట్లు పడగొట్టాడు. కానీ అతని సగటు (31.98)తో పాటు అతని ఎకానమీ రేటు (6.23) రెండూ ఎక్కువగా ఉండటం వల్ల ఇతన్ని జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న టీమ్​లో హార్దిక్ పాండ్యా మినహా భారత్‌కు మరో ఫాస్ట్-బౌలింగ్ ఆల్-రౌండర్లు లేరు. దీంతో మూడవ పేసర్‌గా ఉండగల సామర్థ్యం ఉన్నవారెవరైనా టీమ్ఇండియాకు అవసరం కావచ్చు. దీంతో వైల్డ్​ కార్డ్ ఎంట్రీలో ఇతని పేరు వినిపించచ్చని విశ్లేషకుల అంచనా.

దీపక్​ చాహర్​
ఫాస్ట్ బౌలింగ్ ఆల్-రౌండర్ల అంటే మనకు గుర్తొచ్చే పేర్లలో దీపక్ చాహర్ కూడా ఒకటి. ఈ మేటి స్వింగర్​.. ఆడిన 13 వన్డేల్లో 5.75 ఎకానమీ రేటుతో 16 వికెట్లు పడగొట్టాడు. కానీ ఈ సారి భారత జట్టు తరఫున ఒక్క వన్డే కూడా ఆడలేదు. కానీ జట్టలోకి ఇతని ఎంపిక లాభదాయకమని అంచనా. అయితే ఇప్పుడిప్పుడే అతను గాయాల నుంచి కోలుకుంటున్నాడు. దీంతో అతని శరీరం ఈ సుదీర్ఘమైన ఫార్మాట్​కు సహకరించగలదా అన్న ప్రశ్నలు కూడా లేవనెత్తతున్నాయి.

శిఖర్​ ధావన్
వన్డే జట్టులో స్థానం కోల్పోయాక శిఖర్ ధావన్.. 2022 నుంచి టీమ్​ఇండియా తరఫున ఈ ఫార్మాట్‌లో ఆడలేదు. సీనియర్స్​లో మేటి స్కిప్పర్​ అయిన ధావన్​ను ఆసియా క్రీడల్లో ఎంపిక చేసుకోలేదన్న విషయంపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రపంచ కప్‌కు అతడ్ని బ్యాకప్ ఓపెనర్‌గా తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మ,శుభ్‌మాన్ గిల్​తో పాటు ధావన్​ను కూడా ఓపెనర్స్​ ​లిస్ట్​లో జోడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Last Updated : Jul 19, 2023, 8:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.