ETV Bharat / sports

World Cup 2022: రాణించిన యస్తికా భాటియా.. బంగ్లా లక్ష్యం ఎంతంటే? - mithali raj news

World Cup 2022: ఐసీసీ మహిళల ప్రపంచకప్​లో భాగంగా బంగ్లాదేశ్​తో జరుగుతున్న మ్యాచ్​లో భారత్​ 229 పరుగులకే ఆలౌటైంది. యస్తికా భాటియా హాఫ్​ సెంచరీతో మెరవగా.. స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఆదుకున్నారు.

World Cup 2022
యస్తికా భాటియా
author img

By

Published : Mar 22, 2022, 10:00 AM IST

Updated : Mar 22, 2022, 11:55 AM IST

World Cup 2022: ఐసీసీ మహిళల ప్రపంచకప్​లో భాగంగా బంగ్లాదేశ్​తో జరుగుతున్న మ్యాచ్​లో భారత్ 7 వికెట్లు కోల్పోయి​ ​229 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి​ బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్​కు.. ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. స్మృతి మంధాన(30), షఫాలీ వర్మ(42) రాణించడం వల్ల మొదటి వికెట్​కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత బ్యాటింగ్​ వచ్చిన యస్తికా భాటియా(50) అర్ధ శతకంతో అలరించింది. కెప్టెన్ మిథాలీ రాజ్​ డకౌట్​ కాగా.. హర్మన్ ప్రీత్​ కౌర్​ (14) స్వల్ప పరుగులకే వెనుదిరిగింది.

బంగ్లాదేశ్​ బౌలర్లలో రితు మోని 3 వికెట్లు, నహిడా అక్తర్​ 2 వికెట్లు, అలమ్​ ఒక వికెట్​ తీశారు.

భారత్‌కు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకం కానుంది. ఐదు మ్యాచులాడిన భారత్ రెండు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే మిథాలీసేనకు సెమీస్‌ అవకాశాలు ఉంటాయి.

ఇదీ చదవండి: IPL 2022 Ricky Ponting: 'ఆ బాధ్యతంతా రిషభ్​ పంత్​పైనే'

Last Updated : Mar 22, 2022, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.