ETV Bharat / sports

Ind vs Eng: టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్​.. భారత్​ బ్యాటింగ్​ - India vs England

World cup 2022 India vs England: మహిళల ప్రపంచకప్​లో జోరు మీదున్న భారత్ నేడు ఇంగ్లాండ్​తో తలపడుతోంది. టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​ బౌలింగ్​ ఎంచుకుంది.

World cup 2022 India vs England
టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌
author img

By

Published : Mar 16, 2022, 6:35 AM IST

World cup 2022 India vs England: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై గెలిచి ఊపుమీదున్న టీమ్​ఇండియా.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌పై విజయం సాధించి గత ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరులో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతోంది.

మరోవైపు ఇంగ్లాండ్‌ జట్టు వరుస వైఫల్యాలను ఎదుర్కొంటోంది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమిపాలై పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్‌ మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో విజయం సాధించి మూడో స్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో స్మృతి మంధాన (123), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (109) సెంచరీలతో చెలరేగడంతో భారత్‌ మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

భారత జట్టు: స్మృతి మంధాన, యాస్తిక భాటియా, మిథాలీరాజ్‌, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, రిచా ఘోష్‌, స్నేహ్‌ రానా, పూజా వస్త్రాకర్‌, జూలన్‌ గోస్వామి, మేఘ్‌నా సింగ్‌, రాజేశ్వరీ గైక్వాడ్

ఇదీ చదవండి: Smriti Mandhana: 'స్మృతి మంధాన చాలా డేంజరస్​'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.