ETV Bharat / sports

Womens T20 Worldcup : బౌలింగ్​ మెరుగుపడాలి..​ బ్యాటర్లు ఆ పని చేయాలి! - మహిళల టీ20 వరల్డ్​ కప్ టీమ్ఇండియా

మహిళల టీ20 ప్రపంచ కప్​లో బోణీ కొట్టింది టీమ్ఇండియా. పాకిస్థాన్​పై గెలిచిన ఉత్సాహంతో వెస్టిండీస్​తో పోరుకు సిద్ధమవుతోంది. ఇక, ఇంగ్లాండ్​ చేతిలో పరాభవం చవిచూసిన వెస్టిండీస్​.. ఎలాగైనా ఈ మెగా టోర్నీలో తొలి విజయం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. భారత్​-వెస్టిండీస్​ మధ్య బుధవారం జరగబోయే మ్యాచ్​లో ఇరు జట్ల బలాబలాలు ఇవే..

womens t20 world cup 2023 india vs west indies

author img

By

Published : Feb 14, 2023, 9:11 PM IST

మహిళల టీ20 వరల్డ్​ కప్​లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. టోర్నీలో మొదటి మ్యాచ్​కే పాకిస్థాన్​తో తలపడిన భారత జట్టు.. అదరగొట్టింది. పాక్​ను ఓడించిన ఉత్సాహంతో.. తన రెండో మ్యాచ్​లో వెస్టిండీస్​ను బుధవారం ఢీ కొట్టబోతోంది. అయితే ఇటీవలే భారత అమ్మాయిలు అండర్​-19 వరల్డ్​ కప్​లో అదరగొట్టారు. అమ్మాయిల విభాగంలో మొదటి వరల్డ్​కప్​ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఎలాగైనా మహిళల టీ20 ప్రపంచకప్​లో విజయం సాధించాలని టీమ్ఇండియా పట్టుదలతో ఉంది. పాక్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. వైస్​ కెప్టెన్ స్మృతి మంధాన లేంకుండా.. పాక్​ టార్గెట్​ను ఛేజ్​ చేసింది. అయితే పాక్​ మ్యాచ్​లో ఆడలేకపోయిన స్మృతి.. వెస్టిండీస్​ మ్యాచ్​లో ఆడే అవకాశముంది. ఇదే జరిగితే విజయోత్సాహంతో ఉన్న జట్టుకు మరింత బలం చేకూరుతుంది.

బౌలింగ్​లో మెరుగుపడాలి..
పాక్​ మ్యాచ్​లో టీమ్ఇండియా బౌలర్లు కొంచెం తడబడ్డారు. చివరి 10 ఓవర్లలో 91 పరుగులు సమర్పించుకున్నారు.​ దీనిపై కొంచెం శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వికెట్ల ఉన్నా.. లేకున్నా.. చివరి ఓవర్లలో బ్యాటర్లు భారీ షాట్లకు ప్రయత్నిస్తారు. అందుకే ఆఖరులో పరుగులను కట్టడి చేయాలి. పాక్ మ్యాచ్​లో 18వ ఓవర్లో రిచా ఘోష్​​ మూడు ఫోర్లు బాదకుంటే.. మ్యాచ్​ పాక్​ చేతుల్లోకి వెళ్లేది. అలాంటి సమయంలో తక్కువ టార్గెట్​ ఉంటే ఛేదన సులభమవుతుంది. వెస్టిండీస్​తో మ్యాచ్​లో చివరి ఓవర్లలో పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలి. ఇటీవలే వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు సిరీస్​లో వెస్టిండీస్​పై భారత్​ రెండు సార్లు గెలిచింది. ఆ అనుభవం ఇప్పుడు జట్టుకు ప్లస్​ అవుతుంది.

బ్యాటర్లు పెద్ద షాట్​లకు వెళ్లాలి..
టీమ్ఇండియా వరల్డ్​ కప్​ గెలవాలంటే బ్యాటింగ్​ విభాగంలో ఇంకొంచెం మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. అండర్​-19 వరల్డ్​ కప్​ కెప్టెన్​ షెఫాలీ వర్మ కూడా పాక్​ మ్యాచ్​లో పెద్ద షాట్లు ఆడలేకపోయింది. ఓపెనర్​ స్మృతి మంధాన లేకపోవడం వల్ల.. యాస్తికా భాటియా, కెప్టెన్ హర్మన్​ప్రీత్​ కౌర్​ పరుగులు రాబట్టడంలో అంతగా ప్రభావం చూపించలేకపోయారు. బ్యాటర్​ జెమీమా రోడ్రిగ్స్​ అద్భుతంగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. అయితే, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా తమ స్ట్రైక్ రేట్‌ను పెంచుకోవాలి, పెద్ద షాట్‌లకు వెళ్లాలి. ఇక, స్మృతి మంధాన చేరిక బ్యాటింగ్‌ను బలపరుస్తుందనడంలో సందేహం లేదు.

వెస్టిండీస్​ది 'తొలి' ఉత్సాహం..
మొదటి మ్యాచ్​లో ఇంగ్లాండ్​ చేతిలో ఓడిపోయిన వెస్టిండీస్​ ఎలాగైనా భారత్​పై గెలిచి.. ఈ మెగా టోర్నీలో తొలి విజయం నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. హేలీ మత్యూస్​ నేతృత్వంలోని వెస్టిండీస్​ ఇప్పటికే 14 మ్యాచ్​ల్లో ఓటమి చవిచూసింది. అయినా, తన అనుభవం కారణంగా ఆమెనే కెప్టెన్​గా కొనసాగుతోంది. అయితే, ఈ ప్లేయర్​ జట్టులో ఉండటం వెస్టిండీస్​కు చాలా ముఖ్యం. మరోవైపు, గాయం నుంచి మరో అనుభవం కలిగిన ప్లేయర్ స్టెఫానీ టేలర్​ తిరిగి జట్టులోకి వచ్చింది. ఇది వెస్డిండీస్​కు మంచి పరిణామమే. ఈ సారైనా ఈ జట్టు గెలుస్తుందో లేదో చూడాలి.

టీమ్​ఇండియా జట్టు : హర్మన్​ప్రీత్(కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, అంజలి శర్వాణి, పూజ వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే.

వెస్టిండీస్​ జట్టు : హేలీ మాత్యూస్(కెప్టెన్), షెమైన్ క్యాంప్​బెల్(వీసీ), ఆలియా అల్యేన్, షామిలియా కన్నెల్, అఫీ ఫెచర్, షబికా గజ్​నబి, చిన్నెల్ హెన్రీ, త్రిషన్ హోల్డర్, జైదా జేమ్స్​, జెనాబా జోసెఫ్, చెడియన్ నేషన్, కరిష్మా రామ్​హరక్, షకీరా సెల్మన్, స్టెఫనీ టేలర్, రషద విలియమ్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.