ETV Bharat / sports

న్యూజిలాండ్ ధనాధన్​ బ్యాటింగ్​​.. భారత్​ లక్ష్యం ఎంతంటే?

Worldcup 2022 Ind vs Nz: ఐసీసీ మహిళల ప్రపంచకప్​లో భాగంగా టీమ్​ఇండియాతో జరుగుతున్న మ్యాచ్​లో న్యూజిలాండ్ జట్టు ధాటిగా ఆడింది.​ టీమ్​ఇండియాకు 261 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

india women cricket team bowler
puja vastrakar
author img

By

Published : Mar 10, 2022, 9:58 AM IST

Updated : Mar 10, 2022, 12:30 PM IST

Worldcup 2022 Ind vs Nz: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా టీమ్​ఇండియాతో జరిగిన మ్యాచ్​లో న్యూజిలాండ్​ బాగా ఆడింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగుల మెరుగైన స్కోర్‌ సాధించింది. దీంతో భారత్‌ ముందు పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది.

అమీ సత్తర్​వైట్​(75), అమెలియా కెర్​(50), కెటీ మార్టిన్​(41), సోఫీ డివైన్​(35) బాగానే రాణించారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్​ 4, రాజేశ్వరి గైక్వాడ్​ 2, ఝులన్​ గోస్వామి ఓ వికెట్​ తీశారు.

అగ్రస్థానానికి అడుగుదూరంలో..

మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్​ఇండియా పేసర్‌ ఝులన్‌ గోస్వామి రికార్డు సృష్టించింది. ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా.. ఆస్ట్రేలియన్‌ మహిళ బౌలర్‌ లిన్‌ ఫుల్‌స్టన్‌తో కలిసి గోస్వామి అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో గోస్వామి ఈ ఘనతను దక్కించుకుంది. ఇంకా ఒక్క వికెట్​ తీస్తే అగ్రస్థానానికి చేరుకుంటుంది.

ఇదీ చదవండి: Test Rankings 2022: టెస్ట్​ ర్యాంకింగ్స్​లో అతడే నెం. 1

Last Updated : Mar 10, 2022, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.