Women World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరేందుకు కీలకమైన మ్యాచ్‌లో టీమ్ఇండియా అదరగొట్టింది. బ్యాటర్లు స్మృతి మంధాన (71), షెఫాలీ వర్మ (53), కెప్టెన్ మిథాలీ రాజ్ (68) అర్ధశతకాలతో రాణించారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది భారత్. సఫారీ బౌలర్లలో మసబతా క్లాస్ 2, షబ్నిమ్ ఇస్మైల్ 2, క్రియో ట్రయాన్, ఖాక చెరో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమ్ఇండియా. ఓపెనర్లు మంధాన, షెఫాలీ వర్మ శుభారంభాన్ని అందించారు. 15వ ఓవర్లలో షెఫాలీ ఔట్ కాగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యస్తికా భాటియా (2) కూడా వెంటనే పెవిలియన్ బాటపట్టింది. దీంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. ఆ తర్వాత కెప్టెన్ మిథాలీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది మంధాన. ఆఖర్లో హర్మన్‌ప్రీత్ (48) కూడా మెరిసింది.
మిథాలీ రికార్డు: ఈ ప్రపంచకప్‌లో అరుదైన రికార్డు నెలకొల్పింది సారథి మిథాలీ రాజ్. ప్రపంచకప్‌లో హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత పెద్ద వయస్కురాలిగా నిలిచింది. అయితే వరల్డ్‌కప్‌లో అర్ధశతకం చేసిన అత్యంత పిన్నవయస్కురాలు కూడా మిథాలీనే కావడం విశేషం.
-
Youngest Indian to score 50 in WC - Mithali Raj
— BCCI Women (@BCCIWomen) March 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Oldest Indian to score 50 in WC - Mithali Raj
Pure class, quality and longevity. Well done, skip @M_Raj03 🙌🏾🙌🏾 pic.twitter.com/4HbpjPm12P
">Youngest Indian to score 50 in WC - Mithali Raj
— BCCI Women (@BCCIWomen) March 27, 2022
Oldest Indian to score 50 in WC - Mithali Raj
Pure class, quality and longevity. Well done, skip @M_Raj03 🙌🏾🙌🏾 pic.twitter.com/4HbpjPm12PYoungest Indian to score 50 in WC - Mithali Raj
— BCCI Women (@BCCIWomen) March 27, 2022
Oldest Indian to score 50 in WC - Mithali Raj
Pure class, quality and longevity. Well done, skip @M_Raj03 🙌🏾🙌🏾 pic.twitter.com/4HbpjPm12P
ఇదీ చూడండి: Women World Cup 2022: మిథాలీ సేన సెమీస్‌కు చేరుతుందా?