ETV Bharat / sports

వచ్చే ఏడాది నుంచే మహిళల ఐపీఎల్‌.. ఆరు జట్లతో..

author img

By

Published : Mar 25, 2022, 11:44 PM IST

Women IPL: క్రికెట్​ అభిమానులకు గుడ్​ న్యూస్​. వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్​ నిర్వహించనున్నట్లు బీసీసీఐ చీఫ్ సౌరవ్​ గంగూలీ ప్రకటించారు. గత కొద్ది రోజులగా మహిళల ఐపీఎల్​ నిర్వహించాలని డిమాండ్​ పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎవల్​
మహిళ ఐపీఎల్​

Women IPL: ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు మహిళల క్రికెట్‌కు సంబంధించిన ఓ గుడ్‌ న్యూస్‌ వెలువడింది. పురుషుల ఐపీఎల్‌ తరహాలోనే వచ్చే ఏడాది నుంచి ఆరు జట్లతో కూడిన మహిళా ఐపీఎల్‌ నిర్వహించనున్నట్లు బీసీసీఐ చీఫ్​ సౌరవ్ గంగూలీ శనివారం ప్రకటించారు. ముంబయిలో జరిగిన ఐపీఎల్‌ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్దికాలంగా మహిళల ఐపీఎల్‌కు విపరీతమైన డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

IPL 2022: ఈ నెల 26న ఐపీఎల్​ 15వ సీజన్​ ప్రారంభం కానుంది. కొత్తగా చేరిన రెండు జట్లతో మొత్తం పది టీమ్​లు టైటిల్​ కోసం తలపడనున్నాయి. జట్ల సంఖ్య పెరిగిన కారణంగా.. ఈసారి భిన్న ఫార్మాట్లో టోర్నీ జరగనుంది. గెలిచిన టైటిళ్లు, ఆడిన ఫైనల్స్‌ ఆధారంగా జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ముంబయి ఇండియన్స్​, కోల్‌కతా నైట్​రైడర్స్​, రాజస్థాన్‌ రాయల్స్​, దిల్లీ క్యాపిటల్స్​, లఖ్‌నవూ సూపర్​ జెయింట్స్​ గ్రూప్‌-ఏలో.. చెన్నై సూపర్​ కింగ్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్‌, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్​, గుజరాత్‌ టైటాన్స్​ గ్రూప్‌-బిలో ఉన్నాయి. ప్రతి జట్టు తన గ్రూపులోని జట్లతో రెండేసి మ్యాచ్‌లు, మరో గ్రూపులోని జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. అంటే ప్రతి జట్టూ ఎప్పటిలాగే 14 మ్యాచ్‌లే ఆడుతుంది.

ఇదీ చదవండి:పాక్​ చేజారిన సిరీస్​.. ఆసీస్​ సూపర్​ విక్టరీ.. 24 ఏళ్ల తర్వాత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.