ETV Bharat / sports

సఫారీలతో టీ20 పోరుకు భారత్​ రెడీ.. ఆ రికార్డుకు అడుగు దూరంలో.. - ఇండియా దక్షిణాఫ్రికా మ్యాచ్​లు

IND vs SA T20: భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. తొలిమ్యాచ్‌ గురువారం దిల్లీ వేదికగా జరగనుంది. ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్‌ జరగనున్న నేపథ్యంలో అందుకోసం ఎంపికవ్వాలంటే ఈ సిరీస్‌ పలువురు భారత క్రికెటర్లకు కీలకంగా మారింది. దక్షిణాఫ్రికా జట్టు కూడా పటిష్ఠంగా ఉండటం వల్ల ఇరుజట్ల మధ్య రసవత్తర పోరు జరగనుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సఫారీలతో టీ20 పోరుకు భారత్​ రెడీ
సఫారీలతో టీ20 పోరుకు భారత్​ రెడీ
author img

By

Published : Jun 8, 2022, 4:55 PM IST

IND vs SA T20: టీ20ల్లో వరుసగా 12 విజయాలు నమోదు చేసిన టీమ్​ఇండియా ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాను ఢీకొననుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే వరుసగా 13 గేమ్‌లలో నెగ్గడం ద్వారా భారత క్రికెట్‌ జట్టు ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో ఆ టోర్నీకి జట్టును ఎంపిక చేయడంలో ఈ సిరీస్‌ కీలకంగా మారనుంది. ఇందులో మెరుగ్గా రాణించిన ఆటగాళ్లకు వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది.

ఈ సిరీస్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడం వల్ల కేఎల్​ రాహుల్‌ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. తనతో ఓపెనింగ్‌ భాగస్వామిగా రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌లో రాహుల్‌ ఎవరిని ఎంపిక చేసుకుంటాడో చూడాల్సి ఉంది. సూర్య కుమార్‌ యాదవ్‌ గాయపడ్డ నేపథ్యంలో మూడోస్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్‌ జయింట్స్‌ తరఫున మూడోస్థానంలో అదరగొట్టిన దీపక్‌ హుడా పేరు కూడా వినిపిస్తోంది.

ఇక మిడిల్‌ ఆర్డర్‌లో రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తీక్‌ల రూపంలో ఇద్దరు వికెట్‌ కీపింగ్‌ బ్యాటర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో దీపక్‌ హుడా, దినేష్‌ కార్తీక్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ మెరుగ్గా రాణిస్తే టీమిండియాకు మరిన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంటాయి. ఇక ఐపీఎల్‌లో సత్తా చాటిన హర్దిక్‌ పాండ్యా ఫినిషర్‌ పాత్ర పోషించనున్నాడు. భువనేశ్వర్‌ కుమార్‌తో కలిసి హర్షల్‌ పటేల్‌, అవేష్‌ఖాన్‌ పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. ఉమర్‌ మాలిక్‌ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. గాయంకారణంగా రవీంద్ర జడేజా అందుబాటులో లేనందున 2019 తర్వాత యజువేంద్ర చాహల్‌, కులదీప్‌ యాదవ్‌ మళ్లీ కలిసి ఆడే అవకాశం ఉంది.

మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు కూడా పటిష్ఠంగా కనిపిస్తోంది. 2010 నుంచి సఫారీలు భారత్‌లో ఒక్క వైట్‌బాల్‌ సిరీస్‌ కూడా ఓడిపోలేదు. డేవిడ్‌ మిల్లర్‌, డికాక్‌, మక్‌రమ్‌ వంటి బ్యాటర్లతో ఆ జట్టు బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌ విభాగంలో రబాడా, అన్రిచ్ నోర్ట్జే, కేశవ్‌ మహారాజ్‌, తబ్రేజ్ షమ్సీ ఆ జట్టుకు అండగా ఉన్నారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు టీ20ల్లో కలిసి ఆడటం ఇదే తొలిసారి. మ్యాచ్‌ గురువారం రాత్రి 7 గంటలకు ఆరంభంకానుంది.

ఇదీ చూడండి : కోహ్లీ సూపర్​ రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.