ETV Bharat / sports

ఐసీసీ క్రికెటర్ ఆఫ్​ ది ఇయర్​గా బాబర్ అజామ్​​..! - mens cricketer of the year award

2022 ఏడాదికి క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులను ఐసీసీ ప్రకటించింది. అలా మెన్స్‌ క్యాటగిరీలో ఈ అవార్డు పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్​కు దక్కగా.. మహిళల క్యాటగిరీలో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ నాట్‌ స్కివర్​ సొంతమయ్యింది.

babar azam and nat sciver
babar azam and nat sciver
author img

By

Published : Jan 26, 2023, 5:27 PM IST

2022 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులను ఐసీసీ ప్రకటించింది. ఈ క్రమంలో మెన్స్‌ క్యాటగిరీలో క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్​ను వరించగా.. మహిళల క్రికెటర్లలో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ నాట్‌ స్కివర్‌ ఎంపికైంది. 2022 ఏడాదికి వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ అవార్డులు కూడా వీరినే వరించాయి. 2021లోనూ బాబర్‌ అజామ్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. 2022లో మూడు ఫార్మాట్లలో కలిపి 44 మ్యాచ్‌లు ఆడిన బాబర్‌ అజామ్‌ 54.12 సగటుతో 2,598 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు, 15 అర్ధ సెంచరీలున్నాయి. ఉమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచిన నాట్ స్కివర్‌ గతేడాది 17 మ్యాచ్‌ల్లో 833 పరుగులు చేసి 11 వికెట్లు పడగొట్టి ఎంపికైంది. వన్డే క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు కూడా ఈమెనే వరించింది.

టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా బెన్‌ స్టోక్స్‌..
ఇంగ్లాండ్‌ టెస్టు కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. జానీ బెయిర్‌ స్టో (ఇంగ్లాండ్‌), ఉస్మాన్‌ ఖవాజా (ఆస్ట్రేలియా), కగిసో రబాడ (దక్షిణాఫ్రికా)లను వెనక్కినెట్టిన స్టోక్స్‌ ఈ అవార్డును దక్కించుకోవడం విశేషం. కాగా గతేడాది జరిగిన టెస్టుల్లో బెన్‌ స్టోక్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్‌లకు 36.25 సగటుతో 870 పరుగులు చేయడమే కాకుండా 26 వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్‌గా కూడా స్టోక్స్‌ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఆయన ఆడిన 10 టెస్టులకు నాయకత్వం వహించగా.. తొమ్మిదింటిలో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.