ETV Bharat / sports

PUJARA: ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్.. పుజారా ఆడటం కష్టమే?

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన టీమ్ఇండియా.. ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్​తో ఐదు టెస్టులు ఆడనుంది. అయితే ఈ సిరీస్​లో భారత బ్యాట్స్​మెన్​ ఛెతేశ్వర్ పుజారాను బెంచ్​కే పరిమితం చేయనున్నారట. ఇటీవల కాలంలో అతడు పేలవ ప్రదర్శన చేస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

pujara
పుజారా
author img

By

Published : Jun 27, 2021, 11:04 AM IST

టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్​తో పాటు గతకొన్నాళ్లుగా బ్యాటింగ్​లో విఫలమవుతున్న టీమ్​ఇండియా నయావాల్ పుజారాను పక్కన పెట్టాలని యాజమాన్యం భావిస్తోంది! ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్​తో జరిగే ఐదు టెస్టుల సిరీస్​లో భాగంగా అతడి బెంచ్​కే పరిమితమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్​ అనంతరం కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.

pujara
ఛెతేశ్వర్​ పుజారా

పేలవ ప్రదర్శనతో..

భారత్​ నయా వాల్​గా పేరొందిన ఛెతేశ్వర్ పుజారా సాధారణ టెస్టు సగటు 46.49. అయితే 2020 నుంచి అతడు ఆడిన మూడు సిరీస్​లను పరిశీలిస్తే సగటు 26.35కే పరిమితమైంది. గత 30 ఇన్నింగ్స్​లో పుజారా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అందులో 9 మ్యాచ్​లు సింగిల్ డిజిట్​ స్కోర్​కే వెనుదిరిగాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో టెస్టులో 77 పరుగులు చేసి పర్వాలేదు అనిపించినా.. మిగతా మ్యాచ్​ల్లో చతికిలపడ్డాడు.

పుజారా స్థానంలో ఎవరు?

పుజారాకు బదులు కేఎల్​ రాహుల్​, హనుమాన్ విహారిలో ఎవరో ఒకరిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో కాకుండా మూడో స్థానంలో ఆడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి : Sachin: 'గాలిలోనే మ్యాజిక్ చేయొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.