Virat Kohli Test Career : విరాట్ కోహ్లీ.. పేరుకు తగ్గట్టే పరుగులు వేటలో కింగ్‌లా దూసుకుపోతాడు. ఇతడు బ్యాట్‌తో మైదానంలో అడుగు పెట్టాడంటే ప్రత్యర్థులకు చెమటలే! అన్ని సందర్భాల్లో ఈ ఫార్ములా వర్కౌట్ కాకపోయినా దాదాపుగా జరిగి తీరుతుంది! అందుకే విరాట్ బ్యాట్ పట్టి క్రీజులోకి దిగాడంటే ప్రత్యర్థి జట్టు నుంచి గట్టి బౌలింగ్ దళం రంగంలోకి దిగాల్సిందే!
ఆదిలోనే ఆటంకం..
Virat Kohli Test Debut : విరాట్ కోహ్లీకి విండీస్ గడ్డతో ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. 2011లో జమైకాలో జరిగిన టెస్టుతోనే విరాట్ తన టెస్టు కెరీర్‌ను ప్రారంభించాడు. అయితే ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కేవలం 4,15 పరుగులతో సరిపెట్టుకున్నాడు. అయితే ఇప్పటివరకు వెస్టిండీస్‌తో మొత్తం 14 టెస్టులు ఆడిన విరాట్.. 43.26 సగటుతో 822 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో విరాట్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 200.
అయితే ఇప్పటివరకు తన క్రికెట్ కెరీర్లో ఎన్నో అరుదైన రికార్డులను నమోదు చేసిన ఈ రికార్డుల రారాజును కొందరు బౌలర్లు నానా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా వెస్టిండీస్ బౌలర్ల దళం విరాట్‌ను కొన్ని సార్లు పరుగులు తీయకుండా కట్టడి చేసింది. అంతటి మేటి బౌలింగ్ వేసి విరాట్ పరుగుల ప్రవాహానికి అడ్డుపడిన ముగ్గురు విండీస్ బౌలర్లు ఎవరంటే.. జాసన్ హోల్డర్, షేన్ షిల్లింగ్‌ఫోర్డ్, ఫిడేల్ ఎడ్వర్డ్స్.
ఫిడేల్ ఎడ్వర్డ్స్
Fidel Edwards : మిగతా ఆటగాళ్ల బౌలింగ్‌తో పోలిస్తే ఫిడేల్ ఎడ్వర్డ్స్ బౌలింగ్ కాస్త మెరుగ్గా ఉంటుంది. విరాట్ కోహ్లీని పరుగులు తీయకుండా కట్టడి చేయడంలో ఎడ్వర్డ్స్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ విభాగంలో మొదటి స్థానంలో కూడా ఉన్నాడు. ఎందుకంటే తాను వేసిన బౌలింగ్‌లోని 83 బంతుల్లో కేవలం 30 పరుగులు మాత్రమే కోహ్లీకి ఇచ్చిన ఎడ్వర్డ్స్.. విరాట్ అరంగ్రేట సిరీస్‌లో మెరుగ్గా రాణించలేకపోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మూడు సార్లు ఫిడేల్ ఎడ్వర్డ్స్ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు విరాట్ కోహ్లీ.
జాసన్ హోల్డర్
Jason Holder : విండీస్‌తో తలపడిన టెస్టుల్లో కోహ్లీని రెండు సార్లు ఔట్ చేసిన బౌలర్లు ఐదుగురు ఉన్నారు. అయితే వీరందరితో పోలిస్తే జాసన్ హోల్డర్ సగటు కాస్త ఉత్తమంగా ఉంది. ఎత్తులో కాస్త పొడువుగా ఉండడం ఇతడికి జట్టుకి కలిసొచ్చే అంశం. ఆ ఎత్తును ఉపయోగించుకుని అదనపు బౌన్స్‌ను రాబడతాడు హోల్డర్. అంతేకాకుండా బంతిని స్వింగ్ చేయడంలో ఇతడు దిట్ట. టెస్టుల్లో ఇప్పటి వరకు కోహ్లీకి 144 బాల్స్‌ను సంధించిన హోల్డర్ 69 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో వీరిద్దరు మళ్లీ తలపడితే ఆట రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
షేన్ షిల్లింగ్‌ఫోర్డ్
Shane Shillingford : క్రికెట్ గాడ్ సచిన్ తెందుల్కర్‌కు అది ఆఖరి టెస్టు సిరీస్. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు మన దేశానికి వచ్చింది. ఆ సిరీస్‌లో ఆఫ్ స్పిన్నర్ షేన్ షిల్లింగ్‌ఫోర్డ్ కోహ్లీని తన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టాడు. అతడి బౌలింగ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న విరాట్ 30 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. కాగా, రెండు సార్లూ అతడి బౌలింగ్‌లోనే విరాట్ ఔట్ అవ్వడం విశేషం. ఇక ప్రస్తుతం టీమ్ఇండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారం తొలి టెస్టు ప్రారంభమైంది.
-
My records. My awards. My wins & losses. #WipeMyRecordClean
— Virat Kohli (@imVkohli) June 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Because what I am, has no bearing on what I am about to be!#MyAccountStartsToday with #HSBCIndia, the springboard of my story that is yet to be written.
Get ready to start yours! https://t.co/cm4fNLek2I@HSBC_IN #ad pic.twitter.com/PU5WNk8ieY
">My records. My awards. My wins & losses. #WipeMyRecordClean
— Virat Kohli (@imVkohli) June 5, 2023
Because what I am, has no bearing on what I am about to be!#MyAccountStartsToday with #HSBCIndia, the springboard of my story that is yet to be written.
Get ready to start yours! https://t.co/cm4fNLek2I@HSBC_IN #ad pic.twitter.com/PU5WNk8ieYMy records. My awards. My wins & losses. #WipeMyRecordClean
— Virat Kohli (@imVkohli) June 5, 2023
Because what I am, has no bearing on what I am about to be!#MyAccountStartsToday with #HSBCIndia, the springboard of my story that is yet to be written.
Get ready to start yours! https://t.co/cm4fNLek2I@HSBC_IN #ad pic.twitter.com/PU5WNk8ieY