ETV Bharat / sports

T20 worldcup: వచ్చే ఏడాది విండీస్​​, లంక క్వాలిఫయర్స్​ ఆడాల్సిందే

author img

By

Published : Nov 7, 2021, 1:42 PM IST

వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్​ టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లు. డిఫెండింగ్ ఛాంపియన్స్​ వెస్టిండీస్, శ్రీలంక జట్లు మాత్రం క్వాలిఫయింగ్ రౌండ్​లో ఆడాల్సి ఉంటుంది.

SL, WI
శ్రీలంక, వెస్టిండీస్

ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్​న​కు నేరుగా అర్హత సాధించాయి అఫ్గానిస్థాన్​, బంగ్లాదేశ్​ జట్లు. డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్టిండీస్​, శ్రీలంక జట్లకు మాత్రం ఈ అవకాశం దక్కలేదు. ఇరు జట్లు క్వాలిఫయింగ్​ రౌండ్​లో ఆడి అర్హత సాధిస్తేనే టోర్నీలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

టీ20 ప్రపంచకప్​ 2021లో విన్నర్​, రన్నరప్​గా నిలిచిన రెండు టీమ్​లతో సహా ఐసీసీ టీ20 ర్యాక్సింగ్స్​లో టాప్​ 8 జట్లు వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్​ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి. అయితే.. ఇంగ్లాండ్, పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకు టాప్​ 6 స్థానాల్లో ఉన్నాయి.

శనివారం(నవంబర్ 6) జరిగిన మ్యాచ్​లో ఆస్ట్రేలియాతో ఓటమి పాలైన వెస్టిండీస్​ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​లో 10వ స్థానానికి పడిపోయింది. శ్రీలంక 9వ స్థానంలో ఉంది.

ఈ టీ20 వరల్డ్ కప్​లో బంగ్లాదేశ్ అన్ని మ్యాచ్​లు ఓడిపోయినప్పటికీ ర్యాంకింగ్స్​లో 8వ స్థానం సంపాదించుకుంది. ఈ ఏడాది ఆరంభంలో తమ సొంత గడ్డపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​ను ఓడించడమే ఇందుకు కారణం.

వెస్టిండీస్, శ్రీలంకతో పాటు నమీబియా, స్కాట్లాండ్ జట్లు కూడా వచ్చే ఏడాది టోర్నీని క్వాలిఫయింగ్​ రౌండ్​ నుంచి ప్రారంభించనున్నాయి.

ఇవీ చదవండి:

T20 World Cup: విండీస్​పై ఘనవిజయం- సెమీస్​కు ఆసీస్​!

'న్యూజిలాండ్​పై అఫ్గాన్​ గెలిస్తే.. ఆ అనుమానాలు ఖాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.