టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటానని టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Kohli Captaincy) గురువారం ప్రకటించాడు. వన్డేలు, టెస్టుల్లో మాత్రం జట్టుకు సారథిగా ఉంటానని అన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కెప్టెన్‌గా కోహ్లీ భవిష్యత్తు గురించి కొంతకాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి. ముఖ్యంగా నిరుడు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఐదోసారి ముంబయి ఇండియన్స్‌కు(Mumbai Indians Captain) ఐపీఎల్ టైటిల్ అందించిన తర్వాత కోహ్లీ పరిమిత ఓవర్ల నాయకత్వంపై చర్చ ఎక్కువైంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు కోహ్లీ తీసుకున్న నిర్ణయం.. కెప్టెన్ కావాలన్న రోహిత్(Rohit sharma Captain) ఆశ నెరవేరడానికి మార్గం సుగమమైనట్లు కనిపిస్తోంది. కానీ బీసీసీఐ రోహిత్‌కే పగ్గాలు అప్పగిస్తుందా అని కచ్చితంగా చెప్పలేం. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఎవరైన యువ క్రికెటర్లకు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు. అయితే కోహ్లీ తర్వాత ఆ స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా(Rohit Sharma Captain News) సరైన వాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. టీ20 జట్టు పగ్గాలను అందుకునేందుకు రోహిత్ శర్మ అర్హుడనే దానికి గణాంకాలు చాలని కొందరు క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇంతకీ కెప్టెన్ అయ్యేందుకు హిట్‌మ్యాన్‌కు ఉన్న అర్హతలేమిటో తెలుసుకుందాం.
కెప్టెన్‌గా తొలి ఘనత
చాలా ఏళ్ల తర్వాత టీమ్ఇండియాలో స్ప్లిట్ కెప్టెన్సీ అమలు కానుంది. విరాట్ కోహ్లీ టీ20 జట్టు పగ్గాలను వదిలేయడం వల్ల.. ఇప్పుడు ఆ బాధ్యతలకు స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అర్హుడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే.. కెప్టెన్‌గా తనను నిరూపించుకునే అవకాశం దక్కినట్లే. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్‌గా ఇప్పటికే మూడు ట్రోఫీలను అందుకున్నాడు హిట్‌మ్యాన్. ఈ క్రమంలో టీ20 జట్టుకు నాయకత్వం వహించాలో రోహిత్‌కూ అవగాహన ఉంది. కెప్టెన్‌గా కోహ్లీ ఆడిన 45 మ్యాచ్‌ల్లో 27 సార్లు భారత్ విజయాన్ని నమోదు చేసింది.
భారత టీ20 జట్టుకు రోహిత్ శర్మ 19 సార్లు నాయకత్వం(Rohit Sharma Captain in International Cricket) వహించగా.. అందులో 15 సార్లు విజయం సాధించాడు. ఈ 19 మ్యాచ్‌ల్లో ఏడు హాఫ్‌సెంచరీలు, రెండు సెంచరీలు రోహిత్ చేశాడు. అయితే భారత జట్టు నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సెంచరీ(Rohit Sharma Captain Record) సాధించిన బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్ ఘనత సాధించాడు. అంతేకాకుండా 2018లో జరిగిన ట్రైసిరీస్ నిదహాస్ ట్రోఫీలో సారథిగా వ్యవహరించిన రోహిత్ భారత జట్టును గెలిపించాడు.
ఐపీఎల్ చరిత్రలో..
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా(Rohit Sharma IPL Career) రోహిత్ శర్మ ఘనత సాధించాడు. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబయి ఇండియన్స్ జట్టును విజేతగా నిలపడంలో రోహిత్ పాత్ర ఎంతో కీలకం. ఐపీఎల్ 8 సీజన్లలో రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబయి జట్టు.. 5 సార్లు ట్రోఫీని అందుకోవడం సహా 6 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది.
ఇదీ చూడండి.. Team India Future Captain: భవిష్యత్ కెప్టెన్ కేఎల్ రాహుల్!