ఐపీఎల్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లకు ఓ గోల్డెన్ ఛాన్స్. ఈ మెగాలీగ్‌లో ఆడేందుకు ఆటగాళ్లు తహతహలాడుతుంటారు. జాతీయ జట్టులోకి చోటు దక్కించుకోవాలనుకునే యంగ్ ప్లేయర్స్‌కు, ఫామ్ తప్పిన ప్లేయర్స్‌కు తామేంటో నిరూపించుకోవడానికి ఓ చక్కని వేదిక. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు ఈ మెగాలీగ్ ద్వారా తమ సత్తా ఏంటో చూపారు. ఇక ఐపీఎల్ 2023 సీజన్ విషయానికొస్తే.. పనులు చకచక జరగుతున్నాయి. మీనీ ఆక్షన్ కోసం డిసెంబరు 23న కొచి వేదికగా జరగనుంది. ఈ మేరకు 405 మందితో కూడిన జాబితాను రీసెంట్గా బీసీసీఐ విడుదల చేసింది. మొత్తం 991 మంది రిజిస్టర్ చేసుకున్నప్పటికీ సగానికి మించి ప్లేయర్స్‌ను తొలగించి తుది జాబితాను ఖరారు చేసింది. ఇందులో మొత్తంగా జాబితాలో 273 మంది భారత ఆటగాళ్లు, 132 విదేశీ ఆటగాళ్లున్నారు. అసోసియేట్ సభ్య దేశాల నుంచి నలుగురు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
అయితే ఎప్పటి లాగానే ఈ ఏడాది కూడా ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫ్రాంచైజీలు కూడా యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే ఈ సారి మినీ వేలం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అతి పిన్న వయస్కుడైన ప్లేయర్ ఎవరు అనేది హాట్ టాపిక్‌గా మారిపోయింది. అల్లా ఘజన్ఫర్ ప్రస్తుతం మినీ వేలంలో పాల్గొన్న ప్లేయర్లలో అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. అతడి వయసు 15 ఏళ్ల 152 రోజులే కావడం విశేషం. పదహారేళ్లు కూడా నిండకముందే ఏకంగా వేలంలో పాల్గొంటున్నాడు. ఇక అతడిని ఏదైనా ఫ్రాంఛైజీ కొనుగోలు చేస్తుందో లేదో చూడాలి మరి.
ఘజన్ఫర్ విషయానికొస్తే.. అతడు 2007 జులై 15న జన్మించాడు. అతడు రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. Shpageeza Cricket Leagueలో అతడు మిస్ ఐనక్ నైట్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 6.2 అడుగుల ఎత్తు ఉన్న ఇతడు ఈ ఏడాది ఈ లీగ్‌లో హిందుకుష్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 పరుగలు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. దీంతో అందరీ దృష్టిని ఆకర్షించాడు. అతడి బేస్ ప్రైస్ రూ.20లక్షలు.
ఇక ఇదే మినీ ఆక్షన్‌లో ఎక్కువ వయస్సున్న ప్లేయర్‌గా అమిత్ మిష్రా నిలిచాడు. ఈ వెటరన్ ఇండియన్ స్పిన్నర్ వయసు 40 ఏళ్లు. టీ20 క్రికెటలో ఇప్పటివరకు 244 మ్యాచులు ఆడి 22.38 యావరేజ్, 7.14 ఎకానమీతో 272 వికెట్లు తీశాడు. ఇక 154 ఐపీఎల్ మ్యాచులు ఆడి 23.97 యావరేజ్‌తో 166వికెట్లు పడగొట్డాడు.
ఇదీ చూడండి: U19 worldcup: జట్టును ప్రకటించిన యూఎస్‌ఏ.. అందరూ భారత సంతతే