ETV Bharat / sports

2023 వరల్డ్​కప్​లో టీమ్​ఇండియా​ వికెట్​కీపర్​ అతడేనా?.. ఛాన్స్​ కొట్టేశాడుగా! - భారత్​ ప్రపంచకప్​ 2023

భారత్​ వేదికగా వన్డే ప్రపంచకప్​ 2023 జరగనుంది. అయితే టీమ్​ఇండియా ప్లేయర్​ పంత్​ గాయపడిన కారణంగా వికెట్​ కీపింగ్ ఎవరు చేస్తారనే సందిగ్ధత నెలకొంది. తాజాగా నెట్టింట కొత్త వికెట్​ కీపర్​ అతడేనని వార్తలు వస్తున్నాయి. ఆ ప్లేయర్​ ఎవరంటే?

who is the india wicket keeper wc
who is the india wicket keeper wc
author img

By

Published : Apr 22, 2023, 5:10 PM IST

ODI World Cup Team India Wicket Keeper: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ గెలుపు అనంతరం భారత ఆటగాళ్లు ఐపీఎల్​లో వినోదం పంచుతూ బిజీ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్​ ఫైనల్​ ఆడనున్నారు. అనంతరం స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్​ కప్​లో పాల్గొనున్నారు. రోహిత్​ శర్మ సారథ్యంలో భారత్.. హాట్​ ఫెవరెట్​గా బరిలో దిగనుంది. టోర్నీ స్వదేశంలో జరగడం భారత్​కు కలిసొచ్చే అంశమే. గత మూడు టోర్నీల్లో ఆతిథ్యమిచ్చే జట్లే విజయం సాధించాయి. దీంతో ఈ సారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్​ అవుతుందో లేదో చూడాలి!

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం టీమ్​ఇండియా​కు బౌలింగ్, వికెట్​ కీపింగ్​ ప్రధాన సమస్యలుగా మారాయి. బ్యాటింగ్ పరంగా​ పటిష్ఠంగానే ఉన్నప్పటికీ .. ​బౌలింగ్​ ఇంకా మెరుగుపడాల్సి ఉంది. భారత స్టార్​ బౌలర్​ జస్​ప్రీత్​ బుమ్రా ఇప్పుడిప్పుడే వెన్నుముక సర్జరీ నుంచి కోలుకుంటున్నాడు. ఆగస్టు నుంచి అతడు నెట్​ ప్రాక్టీస్​కు అందుబాటులో ఉంటాడు. ప్రపంచ కప్​ సమయానికి బుమ్రా పూర్తిస్థాయి ఫిట్​నెస్ సాధిస్తాడని ఆశిస్తున్నామంటూ బోర్డు సెలెక్టర్లు కూడా తెలిపారు.

అయితే టీమ్​ఇండియాకు వికెట్​ కీపర్​ కొరత మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 2019 వరల్డ్ కప్​ తర్వాత ధోనీ రిటైర్మెంట్​ ప్రకటించినప్పటి నుంచి భారత్​కు మూడు ఫార్మాట్లలో వికెట్​ కీపింగ్​లో లోటు ఏర్పడింది! నాలుగేళ్లుగా స్థిరమైన కీపర్​ లేకపోవడం అభిమానులను కలవరపెడుతోంది. గత కొద్దికాలంగా వికెట్​ కీపర్​ పాత్రను పోషించిన రిషభ్​ పంత్​కు గతేడాది డిసెంబరులో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడ్డ రిషబ్.. ఈ వరల్డ్​ కప్​నకు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో వరల్డ్​కప్​నకు టీమ్​ఇండియాకు వికెట్​ కీపర్​ ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఆ స్థానంలో రాహుల్​?
అయితే రిషభ్​​ స్థానాన్ని బీసీసీఐ.. బ్యాటర్​ రాహుల్​తో భర్తీ చేయబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. పంత్​​ పూర్తి ఫిట్​నెస్​తో జట్టులో ఉన్న సమయంలో కూడా రాహుల్ చాలా మ్యాచ్​ల్లో వికెట్​ కీపింగ్​ చేశాడు. కెరీర్​ పరంగా.. రాహుల్​ ఓపెనర్​గా, మిడిలార్డర్​లో కూడా రాణిస్తాడు. వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో కూడా చాలా సార్లు తన క్లాస్​ పర్ఫామెన్స్​తో ఆకట్టుకున్నాడు రాహుల్​. అతడు 18 ఇన్నింగ్స్​ల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్​కు దిగి 53 సగటుతో 742 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్​ స్టాటిస్టిక్స్​తో సెలక్టర్ల దృష్టిలో రాహుల్ ముందు వరుసలో ఉన్నాడు. రానున్న ప్రపంచకప్​లో రిషభ్​​ స్థానంలో రాహుల్ వికెట్​కీపింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు ఇషాన్​ కిషన్​, సంజూ శాంసన్​లు కూడా వికెట్​ కీపర్​ రేసులో ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.