Whitewash In T20 Cricket History T20 world cup 2024 : టీ20 వరల్డ్ కప్ ముందు టీమ్‌ఇండియా ఆడుతోన్న ఆఖరి సిరీస్(IND vs AFG) ఆఫ్గానిస్థాన్‌తో. ఈ సిరీస్‌లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తూ అదరగొడుతోంది. ఇప్పటికే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను తన సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ ఫార్మాట్‌లో కొత్త చరిత్ర లిఖించేందుకు రెడీ అవుతోంది. అఫ్గానిస్థాన్‌పై నేడు బెంగళూరు వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే టీ20 హిస్టరీలో అత్యధిక వైట్‌వాష్‌లు(Historic whitewash) చేసిన టీమ్‌గా భారత్ అవతరించే అవకాశం ఉంటుంది.
ఇప్పటివరకూ టీ20 హిస్టరీలో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అత్యధిక వైట్‌వాష్‌లు(8) చేసిన జట్లుగా టీమ్‌ఇండియా, పాకిస్థాన్ సంయుక్తంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు అఫ్గాన్‌తో మూడో టీ20లో గెలిస్తే పాకిస్థాన్‌ను అధిగమించి 9 వైట్‌వాష్‌లతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా టీమ్‌ఇండియా నిలుస్తుంది.
IND vs AFG Third T20 : కాగా, అఫ్గానిస్థాన్‌పై అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్ఇంయా 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుందన్న సంగతి తెలిసిందే. రెండు మ్యాచుల్లో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించిన రోహిత్ సేన ఇప్పుడు మూడో టీ20లోనూ అద్భుతంగా రాణించి విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. మరి మొదటి రెండు మ్యాచ్‌ల్లో తేలిపోయిన అఫ్గానిస్థాన్ జట్టు మూడో టీ20లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. ఒకవేళ భారత జట్టు గెలిచి ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే కనుక టీ20 వరల్డ్ కప్ ముందు మనోళ్లు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లొచ్చు. ఇకపోతే తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన కెప్టెన్ రోహిత్ కనీసం మూడో టీ20లోనైనా మంచి ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
-
Indore ✈️ Bengaluru#TeamIndia in town for the 3⃣rd & final T20I 👏 👏#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/xKKRi6yf9W
— BCCI (@BCCI) January 15, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Indore ✈️ Bengaluru#TeamIndia in town for the 3⃣rd & final T20I 👏 👏#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/xKKRi6yf9W
— BCCI (@BCCI) January 15, 2024Indore ✈️ Bengaluru#TeamIndia in town for the 3⃣rd & final T20I 👏 👏#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/xKKRi6yf9W
— BCCI (@BCCI) January 15, 2024
తుది జట్లు(అంచనా):
టీమ్‌ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కోహ్లీ, శివమ్ దూబె, జితేశ్ శర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్/కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్/అవేష్ ఖాన్
అఫ్గానిస్థాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, గుల్బదీన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మహ్మద్ నబి, నజీబుల్లా జద్రాన్, కరీమ్ జనత్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్‌హక్ ఫరూఖీ
గద పట్టకపోయినా విజేతలే - టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే !